Press ESC to close

నిరుద్యోగులకు గుడ్ న్యూస్: 10954 గ్రామ పాలన అధికారి పోస్టులకు మార్గదర్శకాలు విడుదల

10954 Grama Palana Officers Posts in Telangana: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది .  10,954 గ్రామ పాలన అధికారి పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.. తాజాగా ఈ పోస్టులపై మార్గదర్శకాలను విడుదదల చేసింది తెలంగాణ ప్రభుత్వం 

నూతన గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థకు “జిపిఓ” గా నామకరణం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాలకు గ్రామ పాలన అధికారులను నియమించాలని రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

రెవెన్యూ శాఖలో కొత్తగా గ్రామ పాలన అధికారుల (GPO ) పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.

Also Read: SBI రిక్రూట్‌మెంట్ 2025: పరీక్ష లేకుండా SBIలో ఉద్యోగం, లక్ష వరకు జీతం

Telangana VRO/VRA Jobs

నియామక విధానం:

ఈ పోస్టులను వివిధ విభాగాల్లోకి తిరిగి నియమించబడిన పూర్వ గ్రామ రెవెన్యూ అధికారులు (VROS), అలాగే జూనియర్ అసిస్టెంట్లు/రికార్డ్ అసిస్టెంట్ల కేడర్‌లో రెగ్యులరైజ్ చేయబడి రెగ్యులర్ పోస్టుల్లోకి చేర్చబడిన మాజీ గ్రామ రెవెన్యూ సహాయకులు (VRAS) నియమించబడతారు, వారు నిర్దేశించిన అర్హతలను నెరవేర్చాలి.

అర్హత ప్రమాణాలు:

కనీస విద్యార్హత
(ఎ) గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్

లేదా

VRO VRAలో ఇంటర్మీడియట్ మరియు కనీసం 5 సంవత్సరాల సర్వీస్

ఉద్యోగ బాధ్యతలు:

గ్రామ పలాన అధికారి యొక్క విధులు మరియు బాధ్యతలు ఈ క్రింది వాటిని కలిగి ఉంటాయి కానీ వీటికే పరిమితం కావు:
ఎ) గ్రామ ఖాతాల నిర్వహణ.
బి) వివిధ ధృవపత్రాల జారీ కోసం విచారణలు నిర్వహించడం.
సి) ప్రభుత్వ భూములు, సరస్సులు మరియు నీటి వనరులపై ఆక్రమణలకు సంబంధించి విచారణలు నిర్వహించడం మరియు వాటి రక్షణను నిర్ధారించడం.
డి) భూమికి సంబంధించిన వివాదాలను పరిశోధించడం మరియు భూమి సర్వేలలో సర్వేయర్లకు సహాయం చేయడం.

ఇ) విపత్తు నిర్వహణకు సంబంధించిన విధులను నిర్వర్తించడం మరియు అవసరమైన/అత్యవసర సేవలను అందించడం.

ఎంపిక ప్రక్రియ:
GPO పోస్టుకు దరఖాస్తుదారుల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఎలిజిబిలిటీ కమ్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించబడుతుంది.

Also Read: RRB ALP రిక్రూట్‌మెంట్ 2025 – 9970 పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

SBI ‘యూత్ ఫర్ ఇండియా’ ఫెలోషిప్ .. గ్రామీణ యువతకు సువర్ణావకాశం!
3,27,000 Per year

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *