అనుష్క ,నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన లేటెస్ట్ సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి (Miss Shetty Mr Polishetty). పి. మహేష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్(UV Creation) బ్యానర్‌లో నిర్మిస్తున్నారు . ఈ సినిమాకు సంగీత దర్శకుడు రాధన్.
ఈ సినిమా విడుదల తేది వాయిదా పడ్డట్లు మూవీ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ తాజాగా ఓ నోట్‌ను విడుదల చేసింది.
సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు బ్యాలన్స్ ఉన్నందున ఆగస్ట్ 4న సినిమా రిలీజ్ చేయడం లేదని, వాయిదా పడ్డట్లు , కొత్త విడుదల తేదిని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.

Leave a Reply