యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ లో ఆటగాళ్లు ఒకరి జెర్సీలపై మరొకరి పేరు తో ధరించారు. జట్టు మొత్తం ఇలా గజిబిజిగా తమ పేరుతో ఉన్నవి కాకుండా జట్టులో ఇతర ఆటగాళ్ల జెర్సీలు ధరించారు.
అయితే దీని వెనుక ఒక కారణముంది. డిమెన్షియా వ్యాధితో బాధపడుతున్న వారికి మద్దతుగా ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇలా ఇతర ఆటగాళ్ల జెర్సీలు వేసుకున్నట్లు ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ తెలిపాడు. అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడుతూ ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని వివరించాడు.
ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మరియు అల్జీమర్స్ సొసైటీ సంయుక్తంగా చేపట్టిన అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆటగాళ్లు జెర్సీలు ధరించారని చెప్పాడు. ‘అల్జీమర్స్ వ్యాధిపై అవగాహన కల్పించాలనే ఇలా జెర్సీలను మార్చుకున్నారు.

Leave a Reply