Press ESC to close

Janasena: జనసేన – టీడీపీ ప్రభుత్వంలో యువతకు ఉన్నచోటే ఉపాధి అవకాశాలు

Janasena – TDP:  యువతకు ఉన్న చోటే ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో జనసేన – టీడీపీ ప్రభుత్వం పని చేస్తుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో వచ్చిన పెట్టుబడులు సైతం వైసీపీ అధికారంలోకి వచ్చాక వెనక్కి మళ్లాయనీ, కొత్తగా వచ్చిన పెట్టుబడులు కూడా ఏమీ లేవన్నారు. ఆదివారం తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తూములూరు సుగాలి కాలనీలో పలువురు యువకులు శ్రీ మనోహర్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. అనంతరం హనుమన్ పాలెం, అన్నవరపులంక గ్రామాల్లో పర్యటించారు. ప్రజలతో మమేకమవుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “వైసీపీ ఇసుక దోపిడి, ఉన్న రోడ్లు నాశనం చేయడం మినహా జరిగిన అభివృధ్ది లేదు. ఎన్నికల ముందు వచ్చి ముద్దులుపెట్టారు. ఇప్పుడు జనాన్ని గుద్దులు గుద్దుతున్నారు. బటన్లు నొక్కుడు కార్యక్రమం తప్ప ఒక్క రోడ్డు వేసింది లేదు. రాష్ట్రంలో అభివృద్ధి ఉంటే పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వస్తేనే యువతకు ఉపాధి లభిస్తుంది. ఉపాధి కోసం ఎదురు చూస్తున్న యువతకు మన ప్రాంతంలోనే అవకాశాలు కల్పిస్తాం. రూ.15 వేల కోసం సుదూర ప్రాంతాలకు పోయే పరిస్థితులు రాకూడదు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గార్ల నాయకత్వంలో మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందాం. ప్రజలంతా సుపరిపాలనకు పట్టం కట్టాలి అని అన్నారు.



* అనారోగ్యంతో మృతి చెందిన మహిళ కుటుంబానికి ఆర్థిక సాయం
అన్నవరపు లంక గ్రామంలో ఇటీవల శ్రీమతి గోన శేషకుమారి అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందారు. ఆ గ్రామ పర్యటనలో భాగంగా ఆమె కుటుంబాన్ని పరామర్శించిన శ్రీ మనోహర్ గారు, గ్రామ జనసేన శ్రేణులు సమీకరించిన రూ.1.2 లక్షల ఆర్థిక సాయాన్ని అందచేశారు. మృతురాలికి ఇద్దరు చిన్నారులు ఉన్నారన్న విషయాన్ని గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న శ్రీ మనోహర్ గారు, పార్టీ తరఫున అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కనిగిరిలంకకు చెందిన శ్రీ మేకా ప్రవీణ్ అనే జనసేన క్రియాశీలక సభ్యుడు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా, పామర్రు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ తాడిశెట్టి నరేష్ రూ. 10 వేలు, గ్రామ ప్రజలు రూ. 2 వేలు మనోహర్ గారి చేతుల మీదుగా ఆర్ధిక సాయం అందచేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *