Press ESC to close

APPSC Group 2 Hall Tickets : 14న ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 హాల్‌టికెట్లు విడుదల..!

APPSC Group 2 Hall Tickets Released: ఏపీపీఎస్సీ గ్రూప్-2 పరీక్ష హాల్‌ టిక్కెట్లను ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు APPSC ప్రకటించింది. గ్రూప్ 2లోని 897 పోస్టులకు  సంబంధించి ఈ నెల 25న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కోసం 24 జిల్లా కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను (Examination Centres) ఏర్పాటు చేశారు. అప్లై చేసుకున్న అభ్యర్థులు APPSC అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in/ నుండి హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.



ఇటీవల APPSC బోర్డు  ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 2 నోటిఫికేషన్‌ను (Group 2 Notification) విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే… ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు లేదని ఏపీపీఎస్సీ ఇప్పటికే స్పష్టం చేసింది.

నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లుగా… ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష (Prelims) ఫిబ్రవరి 25న జరగనుంది. ఈ పరీక్ష ఆఫ్‌లైన్ విధానంలో (Offline Exam) ఆబ్జెక్టివ్ విధానంలో (Objective Type) నిర్వహించబడుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ గ్రూప్ 2 పరీక్షకు 4.83 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

Download Hall Ticket Here

గ్రూప్ 2 అభ్యర్థులను ఎంపిక పరీక్ష, మెయిన్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సర్టిఫికెట్ ఎగ్జామినేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. తాజా నోటిఫికేషన్ ప్రకారం వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 897 గ్రూప్ 2 పోస్టులను భర్తీ చేయనున్నారు.



ఇందులో 331 ఎగ్జిక్యూటివ్‌, 566 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఖాళీలు ఉన్నాయి. డిసెంబర్ 21 నుంచి జనవరి 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. అయితే మెయిన్ పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తారు.

Also Read: Class Room Psychology Notes by GS Reddy Sir For DSC/TRT

AP & TS Education Paper 13-02-2024 Download Here | Eenadu Prathibha, Sakshi Bhavitha

Punjab National Bank Recruitment 2024 – 1025 Specialist Officer Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *