Press ESC to close

ఈ వారం థియేటర్స్ లో సందడి చేయబోతున్న సినిమాల పై ఓ లుక్కెయండి

This Week Theatrical Release Telugu Movies List

గత వారం పలువురు  స్టార్ హీరోల చిత్రాలతో పాటు పలు చిన్న సినిమాలు కూడా థియేటర్లలో సందడి చేశాయి. రజనీకాంత్ లాల్ సలామ్, రవితేజ ఈగల్ , సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన, అంబాజీ పేట మ్యారేజ్ బ్యాడ్, ట్రూ లవర్  చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ వారం కూడా చాలా సినిమాలు థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ సినిమాల జాబితా ఇప్పుడు చూద్దాం.



సుందరం మాస్టర్‌

హాస్యనటుడు హర్ష చెముడు (Harsha Chemudu) ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘సుందరం మాస్టర్’ (Sundaram Master). కళ్యాణ్ సంతోష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దివ్య శ్రీపాద కథానాయికగా నటించింది. ఫిబ్రవరి 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ కూడా జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కోసం ఇటీవల ఓ పెద్ద ఈవెంట్ కూడా జరిగింది.  

మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌రా (Masthu Shades Unnai Ra)

అభినవ్ గోమతం ప్రధాన పాత్రలో తిరుపతిరావు ఇండ్ల దర్శకత్వం వహించిన చిత్రం మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌రా. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్ (Tarun Bhaskar), అలీ రెజా, వైశాలి కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 23న సినిమా థియేటర్లలో విడుదల కానుంది.





సిద్ధార్థ్ రాయ్ (Siddharth Roy)

దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్  దీపక్ సరోజ్ హీరో. ఈ చిత్రానికి వి యశస్వి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 23న థియేటర్లలోకి రానుంది.

ముఖ్య గమనిక (MukhyaGamanika)



నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) కజిన్ విరాన్ ముత్తంశెట్టి హీరోగా నటించిన చిత్రం ‘ముఖ్య గమనిక’. ఈ చిత్రానికి నూతన దర్శకుడు వేణు మురళీధర్ దర్శకత్వం వహించారు. లావణ్య కథానాయికగా నటించింది. ఎమోషనల్‌ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *