Press ESC to close

మేడారంలో కోడి ధర తెలుస్తే షాక్ అవుతారు..కిలో కోడి ఎంతంటే?

Medaram Jathara 2024:

మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. భక్తుల కోలాటాల నడుమ మేడారం మారుమోగుతోంది. తొలిరోజు కీలకమైన సారలమ్మ రాకను దృష్టిలో ఉంచుకుని అడవి అంతా జనంతో కిక్కిరిసిపోయింది. సారలమ్మను కన్నెపల్లి నుంచి గిరిజన పూజారులు డప్పులు, వాయిద్యాలతో తీసుకొచ్చి  గద్దెలపై ప్రతిష్ఠించారు.


పగిడిద్దరాజు, గోవిందరాజులను కూడా పూజారులు కొలువుదీర్చారు. రెండో రోజు సమ్మక్క మేడారం గద్దెకు చేరుకుంది. చిలకలగుట్ట నుంచి సమ్మక్కను అడవి నుంచి బయటకు తీసుకొచ్చి ప్రజల మధ్యకు తీసుకొచ్చారు. సమ్మక్క రాకతో మేడారం పరిసరాలు మారిపోయాయి. భక్తులు జై సమ్మక్క అంటూ నినాదాలు చేస్తూ తమ భక్తిని చాటుకున్నారు.పీఠాలలో కొలువైన అమ్మవార్లను చూసేందుకు భక్తులు పోటెత్తారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి అమ్మవారికి పసుపు, కుంకుమ, పాత్రలు, చీరలు సమర్పిస్తారు. భక్తులు బంగారాన్ని కానుకగా సమర్పించి పూజలు చేస్తారు. మేడారంలోని జంపన్న వాగు, చిలకలగుట్ట, నార్లాపూర్ ప్రాంతాల్లో చెట్ల కింద విడిది చేస్తున్నారు. ఈసారి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు.అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం భక్తులు అమ్మవార్ల ముందు కోళ్లు, మేకలను బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. దీంతో మేడారంలో కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయి. బుధ, గురువారాల్లో కిలో లైవ్ చికెన్ ధర రూ. 150 నుంచి 200 ఉండగా శుక్రవారం రూ. 500కి పెంచారు.


Also Read: TDP – Janasena MLA Candidate First List Released  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *