
Om Bheem Bush Teaser: #OmBheemBush – No Logic Only Magic
శ్రీవిష్ణు (Sree Vishnu) , రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna), ప్రియదర్శి (Priyadarshi) ఈ ముగ్గురి కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘బ్రోచేవారెవరురా’ సినిమాతో నవ్వులు పూయించిన ఈ ట్రియో.. ‘ఓం భీమ్ బుష్’ తో మరో సారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి సిద్ధమయ్యారు.
తాజాగా రిలీజైన ఈ మూవీ టీజర్ అంచనాలను మరింత పెంచేసింది. ఫుల్ కామెడీతో సూపర్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శాస్త్రవేత్తలమని ఈ ముగ్గురు “భైరవకోన” అనే గ్రామానికి వెళ్తారు. అక్కడి గ్రామస్థుల జీవితాల్లో వెలుగు నింపడానికి వచ్చినట్లుగా చిత్రీకరించుకుంటారు.

శాస్త్రవేత్తలైన వీరు గ్రామంలో దయ్యాలు వదిలించడం వంటి సన్నివేశాలు నవ్వులు పూయించాయి. టీజర్ ఫన్నీగా సాగుతున్న సమయంలో.. ఈ ముగ్గురు అక్కడికి వెళ్ళింది నిధి వెతకడానికి అన్నట్లుగా చూపించారు. యూవీ క్రియేషన్స్ (UV Creations) బ్యానర్ పై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. సూపర్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read: Bhimaa Trailer : గోపీచంద్ మాస్ యాక్షన్ సినిమా ‘భీమా’ ట్రైలర్

Leave a Reply