Press ESC to close

నాగచైతన్య మరియు శోభితా ధూళిపాళ పెళ్లి వేడుకలు

శోభితా ధూళిపాళ , నాగ చైతన్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. సోమవారం, శోభిత ప్రీ-వెడ్డింగ్ వేడుక నుండి కొన్ని ఫొటోస్ పంచుకున్నారు. పసుపు దంచతం నుండి చిత్రాలను పంచుకున్నారు, ఇది తెలుగు ఆచారాలలో వివాహ వేడుకల ప్రారంభాన్ని సూచిస్తుంది. శోభిత ఫోటోలను షేర్ చేసిన వెంటనే, చాలా మంది అభిమానులు వారి పెళ్లి తేదీ గురించి ఆసక్తిగా ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు 8న ఓ ప్రైవేట్ వేడుకలో ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నారు .

వేడుక కోసం, ఆమె బంగారు మరియు ఆకుపచ్చ రంగు అంచుతో గులాబీ-నారింజ చీరను ధరించింది. ఈ జంట డిసెంబర్ మొదటి వారంలో వివాహం చేసుకునే అవకాశం ఉంది. అయితే వీరి పెళ్లి తేదీ, వేదికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.నాగ చైతన్య మరియు శోభితా ధూళిపాళ తమ గ్రాండ్ వెడ్డింగ్ కోసం రాజస్థాన్‌లోని ప్యాలెస్‌ని ఎంచుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.

 

View this post on Instagram

 

A post shared by Sobhita (@sobhitad)




ఆగస్టు 8 ఈ జంట నిశ్చితార్థం



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *