
మనస్సుతో పాటు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో యోగా ఎంతో సహాయపడుతుంది. ఈ సంవత్సరం యోగా థీమ్ పూర్తిగా మహిళలకు అంకితం చేయబడింది. మహిళలు నిత్యం యోగా సాధన చేస్తే అనేక వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండొచ్చు. ఈ సందర్భంగా మహిళల కోసం ముఖ్యమైన కొన్ని ముఖ్యమైన యోగా భంగిమలను ఇప్పుడు తెలుసుకుందాము. ఇవి ఎల్లప్పుడూ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి.
మలసానా (GARLAND POSE)
మలసానా యోగా సాధన చేయడం వల్ల మహిళలు PCOD లక్షణాలను నివారించవచ్చు. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పెల్విక్ ఫ్లోర్ కండరాలను యాక్టీవేట్ చేస్తుంది. మలసానా తుంటి (hip) కండరాలను సాగదీయడంలో కూడా సహాయపడుతుంది.
మలసానా నుంచి ఉత్తనాసన సాధన
మలసానా భంగిమలో కూర్చున్న తర్వాత నిలబడి, తిరిగి మలసానా భంగిమలో కూర్చుంటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఇది ఒత్తిడి, ఆందోళన నుంచి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది. వెన్నెముక అనువైనదిగా మారుతుంది. ఈ భంగిమ చేయడం వల్ల కడుపు లోపల అవయవాలు మసాజ్ చేయబడతాయి.
బద్దకోనసనం
బద్ధకోనాసన అంటే సీతాకోకచిలుక భంగిమ. ఈ యోగాసనాన్ని చేయడానికి, నిటారుగా కూర్చుని రెండు పాదాల అరికాళ్లను ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయండి. తర్వాత తొడలను సీతాకోకచిలుక రెక్కల మాదిరిగా పైకి క్రిందికి కదిలించండి. ఈ యోగాసనాన్ని ప్రతిరోజూ ఒకటి నుంచి మూడు నిమిషాలు సాధన చేయడం వల్ల శరీర భంగిమ మెరుగుపడుతుంది. అలాగే తుంటి కదలిక పెరుగుతుంది. పీరియడ్స్ సమయంలో నొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అదే సమయంలో, సీతాకోకచిలుక భంగిమ మూత్రపిండాల ఆరోగ్యం, మహిళల్లో సంతానోత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది.

Leave a Reply