Press ESC to close

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధం – రేవంత్ రెడ్డి

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు గారితో కలిసి సీఎం గారు సమావేశమయ్యారు.

▶️ఉద్యోగుల డీఏ చెల్లింపు విషయంపై శుక్రవారం సాయంత్రంలోగా నిర్ణయం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి
గారు చెప్పారు.

▶️ఉద్యోగులకు సంబంధించి వివిధ సమస్యల పరిశీలన కోసం కేబినేట్ సబ్ కమిటీని నియమించారు.

▶️ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు సభ్యులుగా కేశవరావు గారు ప్రత్యేక ఆహ్వానితులుగా కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు.

▶️దీపావళి తర్వాత శాఖల వారిగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కేబినేట్ సబ్ కమిటీ సమావేశమవుతుంది.

REvanth jac

▶️జీవో 317 పై మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే సమర్పించిన నివేదికపై కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.

▶️జేఏసీ ప్రతినిధులతో జరిగిన సమావేశాల్లో ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *