APSRTC Apprentice Notification 2023: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(APSRTC) విజయనగరం జోన్ లోని వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్(Apprentice) శిక్షణకు సంబంధించి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ITI పాసైన అభ్యర్థులు ఆగస్టు 15లోగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైనవారు ఆగస్టు 18, 19, 21 తేదీల్లో విజయనగరంలోని RTC జోనల్ స్టాఫ్(Zonal) ట్రైనింగ్ కాలేజీలో Certificate Verification చేస్తారు.
విజయనగరం జోన్ పరిధిలోని జిల్లాలు:
తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, మన్యం పార్వతీపురం, శ్రీకాకుళం.
ట్రేడులు:
డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, షీట్ మెటల్ వర్కర్, పెయింటర్, మెషినిస్ట్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ వర్కర్, మిల్ రైట్ మెకానిక్ తదితర ట్రేడుల్లో ఈ ఖాళీలున్నాయి.
అర్హత:
అభ్యర్థి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు(Academic Marks), ఇంటర్వ్యూ(Interview), రిజర్వేషన్ తదితరాల అధారంగా ఎంపిక చేస్తారు.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫీజు: రూ.118.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 15, 2023
APSRTC Apprentice Notification 2023: తూర్పు గోదావరి, కోనసీమ & కాకినాడ జిల్లాల సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీ: 18-08-2023
విశాఖపట్నం, సీతారామరాజు,అనకాపల్లి జిల్లాల సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీ: 19-08-2023
విజయనగరం, శ్రీకాకుళం, పార్వతిపురం మన్యం జిల్లాల సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీ: 21-08-2023
సర్టిఫికెట్ వెరిఫికేషన్ స్థలం: ఆర్టీసీ(RTC), జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ(Zonal Staff Training College), వీటీ అగ్రహారం, విజయనగరం.
For Full Details Visit https://www.apprenticeshipindia.gov.in/
Also Read: IBPS PO Notification 2023 Out | Apply Online For 3049 Vacancies

Leave a Reply