Press ESC to close

‘లక్కీ భాస్కర్’ ఓటీటీ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?

Lucky Bhaskar OTT Release: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan),  మీనాక్షి చౌదరీ జంటగా నటించిన తాజా మూవీ ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో దీపావళి కానుకగా విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల వసూళ్లు చేసింది.

బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్లిన ఈ మూవీ.. ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ (Netflix) దక్కించుకుంది. నవంబర్ 28 నుంచి తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ్, మలయాళంలో స్ట్రీమింగ్ కానున్నట్లు సదరు తాజాగా సంస్థ పోస్టర్ రిలీజ్ చేసింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *