Press ESC to close

కమ్యూనిస్టు ఉద్యమ దశలు | Communist Movement

Communist Movement :

1920లో తాష్కెంట్‌ (రష్యా)లో భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపితమైంది. స్థాపకులు ఎమ్‌.ఎన్‌. రాయ్‌, అబానీ ముఖర్జీ, మహమ్మద్‌ అలీ, మహమ్మద్‌ షఫీజ్‌. రాయ్‌ 1922లో తన రాజకీయ కార్యాలయాన్ని బెర్లిన్‌కు మార్చాడు.

రాయ్‌తో భారతదేశంలోని కొందరు కమ్యూనిస్టు అభిమానులు సంబంధాలు పెట్టుకున్నారు. వారిలో నళినీ గుప్తా, షౌకత్‌ ఉస్మానీ, ఎస్‌.ఎ. డాంగే, ముజఫర్‌ అహ్మద్‌, సింగారవేలు ముఖ్యులు.



1922లో బొంబాయి నుంచి డాంగే సారథ్యంలో వెలువడిన సోషలిస్ట్‌ అనే వార పత్రిక దేశంలో ప్రచురితమైన మొదటి కమ్యూనిస్టు పత్రిక.
1925లో కాన్పూరులో భారత కమ్యూనిస్టు సదస్సు జరిగింది.

ఇదే కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావానికి నాందిగా చెప్పవచ్చు.

1926లో ఇంగ్లండు నుంచి వచ్చిన ఫిలిప్‌ స్ప్రౌట్‌ దేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని ప్రచారం చేశాడు.

1934, ఏప్రిల్‌ 3న జౌళి కార్మికులచే సమ్మె చేయించి ప్రభుత్వ ఆగ్రహానికి గురై నిషేధాన్ని ఎదుర్కొన్నది. నాయకులంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.


1934-41 మధ్య నిషేధం కొనసాగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *