Press ESC to close

టీసీఎస్‌లో 40000 ఉద్యోగాలు!

TCS to hire 40000 freshers from campuses this year

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (TCS) ఈ సంవత్సరం 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్టు ఐటీ దిగ్గజం చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (CHRO) మిలింద్ లక్కడ్ చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య 5 వేల మంది తగ్గినట్లు TCS తెలిపింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఉద్యోగాలు పోవని స్పష్టం చేశారు మిలింద్ లక్కడ్.

టీసీఎస్ కార్యకలాపాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఏకీకృతం చేస్తోంది. కాబట్టి ఏఐ సంబంధిత నైపుణ్యాలను పొందేందుకు E0 నుంచి E3.. అంతకంటే ఎక్కువ స్థాయిలలోని అన్ని స్థాయిల ఉద్యోగాలను భర్తీ చేస్తుంది.

➤E0 (ఎంట్రీ లెవెల్): లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎమ్‌లు), వాటితో ముడిపడిన అప్లికేషన్‌లపై ప్రాథమిక అవగాహన ఉండే వారు ఈ విభాగంలోకి వస్తారు.
➤E1: ప్రాంప్ట్ ఇంజనీర్లు మాత్రమే కాకుండా, ఎల్ఎల్ఎమ్‌ ఏపీఐలతో పని చేయగల సామర్థ్యం ఉన్న వారు ఈ విభాగంలోకి వస్తారు.
➤E2: TCS GenAI సాధనాలను ఉపయోగించడంలో నైపుణ్యం కలిగిన వారు ఈ విభాగంలో ఉంటారు.

➤E3, దానికంటే పైన: ఏఐలో నైపుణ్యం, అవగాహన కలిగిన వారు, దాని అప్లికేషన్లలను అన్ని విభాగాల్లో ఉపయోగించేవారు ఈ విభాగంలోకి వస్తారు.

AI ఉద్యోగాలను తొలగించదు కానీ వాటి స్వభావాన్ని మారుస్తుంది. సామర్థ్యం మెరుగుపడుతుంది అని లక్కడ్ అన్నారు.

టీసీఎస్‌ లాభం రూ.12,380 కోట్లు
ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో టాటా కన్సల్టెన్సీ సర్విసెస్‌ (TCS) నికర లాభం 12 శాతం పెరిగి రూ. 12,380 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 11,058 కోట్లుగా ఉన్నది. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్‌(క్యూ2)లో సాధించిన రూ. 11,909 కోట్ల లాభంతో పోలిస్తే త్రైమాసికవారీగా 4% పెరిగింది.
మొత్తం ఆదాయం 6 % పెరిగి రూ. 63,973 కోట్లు అయ్యింది. గతేడాది Q3లో రూ. 60,583 కోట్ల టర్నోవర్‌ అందుకుంది. వాటాదారులకు ఒక్కో షేరుకి రూ. 66 ప్రత్యేక డివిడెండ్‌తో కలిపి మొత్తం రూ. 76 చెల్లించనుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *