Press ESC to close

Pregnancy: ప్రెగ్నెన్సీ గురించి మొదటి 3నెలలు ఎందుకు దాస్తారు.?

Pregnancy: గర్భధారణ అనేది స్త్రీకి చాలా సంతోషకరమైన విషయం. స్త్రీకి తల్లి కావడం అనేది ఒక కల లాంటిది.

చాలా మంది గర్భం దాల్చిన కనీసం మూడు నెలల వరకు ప్రెగ్నెన్సీ గురించి ఎవరికీ చెప్పకూడదని సలహా ఇస్తారు. ప్రెగ్నెన్సీ విషయాన్ని మూడు నెలలు ఎందుకు దాచిపెడతారు? ఇక్కడ తెలుసుకోండి.

ఎందుకు చెప్పరు..?
మొదటి త్రైమాసికం అంటే గర్భం దాల్చిన మొదటి మూడు నెలలు ప్రతి స్త్రీకి చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో శిశువు ప్రధాన అవయవాలు తల్లి శరీరంలో ఏర్పడతాయి. దీని కారణంగా స్త్రీ శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. అందుకే వైద్యులు కూడా గర్భిణీ స్త్రీలను మొదటి మూడు నెలలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తారు. అయితే ఈ మొదటి త్రైమాసికంలోనే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రెగ్నెన్సీ విషయాన్ని ఎవరితో పంచుకోవద్దని చెబుతారు. పొరపాటున ఏదైనా నష్టం జరిగితే బాధపడకూడదని ఇలా చేస్తారు. మొదటి మూడు నెలలు దాటిన పిండం బలపడుతుంది. ఆ తర్వాత గర్భస్రావం అవకాశాలు చాలా తక్కువ.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది.ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: Health Tips: బీపీ అదుపులో ఉండాలంటే.. ఉదయాన్నే ఈ పని చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *