Maha Kumbh Mela 2025:
యూపీ ప్రయాగ్ రాజ్ (Prayagraj) లో కొనసాగుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం మహా కుంభమేళా (Maha Kumbh Mela 2025) మరో 9 రోజుల్లో ముగియనుంది. ఇది చివరి వారం కావడంతో భక్తుల సంఖ్య భాగా పెరిగింది. 125 సంవత్సరాలకు ఒసారి వచ్చే మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు రోజు లక్షల్లో భక్తులు తరలివస్తున్నారు. కుంభమేళాకు వెళ్లే దారులన్నీ వాహనాలతో కిక్కిరిసి పోయాయి.

చివరి తేదీ పొడగింపు..
ఈ నేపథ్యంలో ప్రభుత్వం కుంభమేళా ముగింపు తేదీని పొడగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మరోవైపు భక్తుల రద్దీని నియంత్రించేందుకు ప్రభుత్వం స్పెషల్ రైళ్ల (Special Trains) ను కూడా నియమించింది. ఆదివారం ఒక్కరోజే సాయంత్రం 6 గంటల వరకు 1.36 కోట్ల మంది కుంభమేళా వచ్చినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది.


Leave a Reply