Press ESC to close

10 Poorest Countries: ప్రపంచంలోని అత్యంత పేద దేశాల జాబితా విడుదల

ప్రపంచంలోని అత్యంత పేద దేశాల జాబితా విడుదల

10 Poorest Countries: ఫోర్బ్స్‌ అందించిన ఈ సూచీలో టాప్‌లో నిలిచిన దేశాలు ప్రపంచంలో అతి చిన్న దేశాలుగా ఉన్నాయి. అత్యంత పేద దేశంగా దక్షిణ సూడాన్‌ ఉండగా.. మడగాస్కర్ 10వ స్థానంలో ఉంది.

1.దక్షిణ సూడాన్‌ (South Sudan)
దక్షిణ సూడాన్‌ ప్రపంచంలోనే అత్యంత పేద దేశంగా గుర్తింపు పొందింది. ఈ దేశపు జీడీపీ 29.99 బిలియన్‌ డాలర్లు. దక్షిణ సూడాన్‌ జనాభా 1.11 కోట్లు. ఈ దేశంలో యువత అత్యధిక శాతంలో ఉంది.

South Sudan 10 Poorest Countries

2.బురుండీ (Burundi)
మధ్య ఆఫ్రికాలోని బురుండీ ప్రపంచంలో రెండవ అత్యంత పేద దేశం. బురుండీ జీడీపీ 2.15 బిలియన్‌ డాలర్లు. ఇక్కడి జనాభా 1,34,59,236. రాజకీయ అస్థిరత, అంతర్గత సంఘర్షణలు ఈ దేశపు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయి. దేశంలోని 80 శాతం జనాభా వ్యవసాయంపైననే ఆధారపడి జీవిస్తోంది.

Forbes Released 10 Poorest Countries List In The World

3.సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (Central African Republic)
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ప్రపంచంలో మూడవ పేద దేశం. ఇక్కడి జనాభా 58,49,358. జీడీపీ 3.03 బిలియన్‌ డాలర్లు. రాజకీయ అస్థిరత, సాయుధ పోరాటం మౌలిక సదుపాయాల కొరతతో ఈ దేశం తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ దేశంలో 80 శాతం జనాభా దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నారు.

4.మలావి (Malawi)
మలావి ప్రపంచంలో నాల్గవ పేద దేశం. మలావి జనాభా 2,13,90,465. జీడీపీ 10.78 బిలియన్‌ డాలర్లు. మలావి గణనీయమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. వర్షాధార వ్యవసాయంపై ఇక్కడ పంటలు సాగుచేస్తుంటారు. ఇక్కడి ప్రభుత్వం విద్య, ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి,పేదరికాన్ని తగ్గించడానికి కృషి చేస్తోంది.

5.మొజాంబిక్ (Mozambique)
మొజాంబిక్ ప్రపంచంలో ఐదవ పేద దేశం. మొజాంబిక్ జనాభా 3,44,97,736. జీడీపీ 24.55 బిలియన్‌ డాలర్లు. ఉగ్రవాదం, హింస మొజాంబిక్ ముందున్న ప్రధాన సమస్యలు. ప్రకృతి వైపరీత్యాలు, వ్యాధులు, జనాభా పెరుగుదల మొదలైనవి ఈ దేశాన్ని పేదరికంలోకి నెట్టివేశాయి.

10 Poorest Nations in The World

6.సోమాలియా (Somalia)
సోమాలియా ప్రపంచంలో ఆరవ పేద దేశం. సోమాలియా జీడీపీ 13.89 బిలియన్‌ డాలర్లు. జనాభా 1,90, 09,151. ఇక్కడి అంతర్యుద్ధం దేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసింది. దీంతో దేశం పతనమయ్యింది.

7.కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ (Democratic Republic of the Congo)
కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ప్రపంచంలో ఏడవ పేద దేశం. జీడీపీ 79.24 బిలియన్‌ డాలర్లు. జనాభా 10,43,54,615. ఈ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రువాండా అనుకూల తిరుగుబాటుదారుల దాడులతో అతలాకుతలమవుతోంది. కాంగోలో దాదాపు 62 శాతం మంది రోజుకు రూ.180 కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు.

8.లైబీరియా (Liberia)
లైబీరియా ప్రపంచంలో ఎనిమిదవ పేద దేశం. లైబీరియా జీడీపీ 5.05 బిలియన్‌ డాలర్లు. జనాభా 54,92,486. ఆఫ్రికన్ దేశమైన లైబీరియాలో అంతర్యుద్ధం కారణంగా శాశ్వత పేదరికం ఏర్పడింది. ప్రపంచ ఆహార కార్యక్రమం వంటి అంతర్జాతీయ సంస్థలు విద్య , ఆరోగ్య సంరక్షణలో లైబీరియాకు సహకారాన్ని అందిస్తున్నాయి.

9.యెమెన్ (Yemen)
ప్రపంచంలోని పేద దేశాలలో యెమెన్ తొమ్మిదవ స్థానంలో ఉంది. యెమెన్ జీడీపీ 16.22 బిలియన్‌ డాలర్లు. జనాభా 34.4 మిలియన్లు. సంవత్సరాల తరబడి కొనసాగుతున్న అంతర్యుద్ధం, రాజకీయ అస్థిరత యెమెన్‌ను ఆర్థికంగా దెబ్బతీశాయి. ఆహారం, నీరు, మందులు, నిత్యావసర వస్తువుల కొరత ఈ దేశాన్ని నిత్యం వెంటాడుతుంటుంది.

10.మడగాస్కర్ (Madagascar)
మడగాస్కర్ ప్రపంచంలోని 10వ పేద దేశం. మడగాస్కర్ జీడీపీ 18.1 బిలియన్‌ డాలర్లు. జనాభా 30.3 మిలియన్లు. మడగాస్కర్ ఆఫ్రికాకు ఆగ్నేయ తీరంలో ఉన్న ఒక ద్వీప దేశం. మైనింగ్, పర్యాటకం ఈ దేశానికి ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి.

dailyinfo247.com/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *