Maha Shivratri 2025 Date And Time in India Calender
Maha Shivratri 2025: హిందువులకు అతి ముఖ్యమైన పండుగలలో మహా శివరాత్రి (Maha Shivratri) ఒకటి. శివ భక్తులకు మరీ ప్రత్యేకమైనది. ప్రతీ ఏడాది మాఘమాసంలోని కృష్ణ పక్షం చతుర్దశి రోజున శివరాత్రి జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 26 బుధవారం రోజున మహాశివరాత్రి వచ్చింది.
ఈ సంవత్సరం మహాశివరాత్రి రోజున త్రిగ్రాహీ యోగం ఏర్పడనుంది. 149 ఏళ్ళ తరువాత సూర్యుడు, బుధుడు, శని కుంభరాశిలో కలిసి వస్తున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున శివుడికి పూజలు, అభిషేకాలు చేయడం ద్వారా శుభఫలితాలు కలుగుతాయి.

పూజకు సరైన ముహూర్తాలు
చతుర్దశి తిథి ప్రారంభం – ఫిబ్రవరి 26 ఉదయం 11:08
చతుర్దశి తిథి ముగింపు – ఫిబ్రవరి 27 ఉదయం 8:54
నిషిత కాల పూజ సమయం – 12:09 am నుంచి 12:59 am, ఫిబ్రవరి 27
నాలుగు ముహూర్తాలు

అయితే మొదటి ప్రహార్ పూజ సమయం: ఫిబ్రవరి 26న సాయంత్రం 6:29 నుండి రాత్రి 9:34 వరకు.
రెండవ ప్రహార్ పూజ సమయం ఫిబ్రవరి 26న రాత్రి 9:34 నుంచి ఫిబ్రవరి 27న తెల్లవారుజామున 12:39 వరకు ఉంటుంది.
మూడవ ప్రహార్ పూజ సమయం ఫిబ్రవరి 26 రాత్రి 12:39 నుండి 3:45 వరకు.
నాల్గవ ప్రహార్ పూజ సమయం ఫిబ్రవరి 27న తెల్లవారుజామున 3:45 నుంచి 6:50 వరకు.
ప్రహార్ అంటే ఏంటి?
ప్రహర అనేది సంస్కృత పదం. రోజును ఎనిమిది భాగాలుగా భాగాలుగా విభజించడాన్ని ప్రహార్ అంటారు. నాలుగు ప్రహారాలు పగటి, నాలుగు రాత్రికి. రోజులోని మొదటి ప్రహారం సూర్యోదయంతో ప్రారంభమై, నాల్గవ ప్రహారం సూర్యాస్తమయంతో ముగుస్తుంది. అలాగే రాత్రి ప్రహారాలు సూర్యాస్తమయంతో మొదలై సూర్యోదయం మధ్య ముగుస్తాయి.
Also Read: Maha Shivratri 2025: మహాశివరాత్రి రోజు భార్యకు ఈ బహుమతి ఇస్తే.. మీరు ఊహించనివి జరుగుతాయ్!

Leave a Reply