Health Tips For Bones: మనం తీసుకునే ఫుడ్ మన ఆరోగ్యాన్ని (Health) నిర్ణయిస్తుంది. పోషకాలు ఉండే ఫుడ్‌ను తీసుకోవడం వల్ల ఎముకలు (Bones) బలంగా, గట్టిగా తయారు అవుతాయి. పోషకాలు (Nutrients), కాల్షియం (Calcium) ఎక్కువగా ఉండే వాటి పదార్థాలు తరచుగా తీసుకుంటే ఎముకల సమస్యలు రావు. ప్రస్తుతం రోజుల్లో ఎక్కువగా పోషకాలు లేని పదార్థాలను తీసుకుంటున్నారు. అందువల్ల ఎముకలు బలహీనంగా మారుతున్నాయి.
ఈ ఆరు రకాల ఫుడ్స్ ఎముకలు పాయిజన్ వంటివి
సాఫ్ట్ డ్రింక్స్ (Soft Drinks)
శీతల పానీయాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం లోపం ఏర్పడుతుంది. ఇందులోని ఫాస్పోరిక్ ఆమ్లం శరీరం నుంచి కాల్షియం శోషణను నిరోధిస్తుంది. దీంతో ఎముకల్లో కాల్షియం తగ్గిపోతుంది. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.
ప్రాసెస్ చేసిన ఫుడ్ (Processed food)
ప్రాసెస్ చేసిన ఫుడ్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతుంది. ఇది ఎముకలను బలహీనం చేస్తుంది. దీంతో బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Health Tips For Bones
టీ, కాఫీ (Tea, coffee)
డైలీ కాఫీ, టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనంగా మారుతాయి. వీటిలోని కెఫిన్ శరీరంలో కాల్షియం శోషణను పూర్తిగా తగ్గిస్తుంది.
ఆల్కహాల్ (Alcohol)
ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాల్షియం తగ్గిపోతుంది. దీంతో ఎముకలు బలహీనమై విరిగిపోతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే ఆల్కహాల్ తీసుకోకపోవడం మంచిది.
నూనె పదార్థాలు (Oily foods)
ఆయిల్ ఫుడ్స్, ఫ్రైడ్ చికెన్, పకోడీలు వంటివి తీసుకోకూడదు. వీటిలో అధికంగా కొవ్వు ఉంటుంది. ఇవి శరీరంలో మంటను కలిగిస్తాయి. దీని వల్ల కాల్షియం పూర్తిగా తగ్గిపోయి బలహీనమవుతారు.
ఉప్పు (Salt)
ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కాల్షియం లోపం ఏర్పడుతుంది. ఎక్కువ ఉప్పు మూత్రం ద్వారా కాల్షియం బయటకు వెళ్లిపోతుంది. దీంతో ఎముకలు బలహీనమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. దీనిని మేము ధృవీకరించడం లేదు.
Also Read: Pregnancy: ప్రెగ్నెన్సీ గురించి మొదటి 3నెలలు ఎందుకు దాస్తారు.?

Leave a Reply