10,954 VRO పోస్టులకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం
గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తామని సీఎం రేవంత్రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు నాయకులు ప్రకటించినట్లుగానే గురువారం మంత్రిమండలి 10,954 గ్రామ పరిపాలన అధికారి (జీపీవో) పోస్టులకు ఆమోదముద్ర వేసింది.
గ్రామస్థాయిలో ఉండే వీఆర్ఏలు (VRA), వీఆర్వో (VRO) వ్యవస్థలను గత ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుత ప్రభుత్వం వారి స్థానంలో జీపీవోలను (GPO) నియమించనుంది. పూర్వ వీఆర్వో, వీఆర్ఏలను కూడా రెవెన్యూశాఖలోకి తీసుకునేందుకు ప్రభుత్వం అవకాశమిచ్చింది. ఇలా ఆసక్తి ఉన్న ఆరువేల మందిని గుర్తించినట్లు సమాచారం. వారు పోను మిగిలిన జీపీవో పోస్టులను భర్తీ చేస్తారు.
వయస్సు
ఈ ఉద్యోగాలకు కనీస వయస్సు 18 to 44 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా వయో సడలింపు ఉంటుంది.
విద్యార్హత
ఏదైనా డిగ్రీ పాసయిన తెలంగాణకు సంబంధించిన అన్ని జిల్లాల వారు కూడా మహిళలు మరియు పురుషులు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
ఎంపిక
తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం పొందాలంటే సెలక్షన్ లో మీరు పరీక్ష రాయవలసి ఉంటుంది.
పరీక్షలో పాస్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.
Also Read: 10వ తరగతితో ఇండియన్ నేవీ గ్రూప్ సి రిక్రూట్మెంట్ 2025 – 327 పోస్టులు

Leave a Reply