Press ESC to close

నిరుద్యోగులకు గుడ్ న్యూస్: 10954 GPO (గ్రామ పాలన అధికారి పోస్టుల)కు మార్గదర్శకాలు విడుదల

10954 Grama Palana Officers Posts in Telangana: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది .  10,954 గ్రామ పాలన అధికారి పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.. తాజాగా ఈ పోస్టులపై మార్గదర్శకాలను విడుదదల చేసింది తెలంగాణ ప్రభుత్వం 

వివిధ విభాగాల్లోకి తిరిగి నియమించబడిన పూర్వ VROల నుండి, అలాగే జూనియర్ అసిస్టెంట్ / రికార్డ్ అసిస్టెంట్ల కేడర్‌లో రెగ్యులరైజ్ చేయబడి రెగ్యులర్ పోస్టుల్లోకి చేర్చబడిన మాజీ VRASల నుండి బదిలీ ద్వారా మరియు డైరెక్టర్ ద్వారా కూడా చేస్తున్నారు.

ఏకంగా 10,954 పోస్టుల భర్తీకి విధివిధానాలను ఖరారు చేసింది. ఇప్పటికే సుమారు 5 వేలకు పైగా పోస్టులు బదిలీల ద్వారా భర్తీ చేశారు. మిగిలిన 5,954 ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ గ్రామ పాలన ఆఫీసర్ (GPO) పోస్టులకు సంబంధించి ‘ పోస్టింగ్ ఆర్డర్’ (నియామక అధికారి)గా ఆయా జిల్లాల కలెక్టర్లకే అధికారం కట్టబెట్టారు.


సంస్థ పేరు :: గ్రామ రెవెన్యూ శాఖలో జాబ్స్
పోస్ట్ పేరు :: గ్రామ పాలన ఆఫీసర్ (GPO) పోస్టుకు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 10,954
రిక్రూట్‌మెంట్ విధానం :: రెగ్యులర్బేసిస్
వయోపరిమితి :: 18-34 సంవత్సరాలు
విద్య అర్హత :: 12th & Any డిగ్రీ
నెల జీతం :: ₹34,000/- to 40,000/-
దరఖాస్తు ప్రారంభం :: త్వరలో నోటిఫికేషన్
దరఖాస్తుచివరి తేదీ :: త్వరలో నోటిఫికేషన్
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్

పోస్టుల వివరాలు:

•గ్రామ పాలన ఆఫీసర్ (GPO) ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఉద్యోగాలు 5954 ఖాళీలు ఉన్నాయి.

అర్హత ప్రమాణాలు:

కనీస విద్యార్హత
బ్యాచిలర్ డిగ్రీ లేదా సమానమైన అర్హతను కలిగి ఉండాలి.

వివిధ విభాగాల్లోకి తిరిగి నియమించబడిన మాజీ VRAల నుండి బదిలీ ద్వారా, అలాగే జూనియర్ అసిస్టెంట్ / రికార్డ్ అసిస్టెంట్ల కేడర్‌లో రెగ్యులరైజ్ చేయబడి రెగ్యులర్ పోస్టుల్లోకి చేర్చబడిన మాజీ VRAల నుండి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి లేదా దానికి సమానమైన అర్హతను కలిగి ఉండాలి. (OR) తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి జారీ చేసిన ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి, గతంలో VROS లేదా VRA లుగా పనిచేసిన రికార్డ్ అసిస్టెంట్ / జూనియర్ అసిస్టెంట్లుగా రెగ్యులర్ సర్వీసులో చేరిన వారి కేడర్‌లో ఐదు సంవత్సరాల సర్వీస్ కలిగి ఉండాలి.

ఉద్యోగ బాధ్యతలు:

గ్రామ పలాన అధికారి యొక్క విధులు మరియు బాధ్యతలు ఈ క్రింది వాటిని కలిగి ఉంటాయి కానీ వీటికే పరిమితం కావు:
ఎ) గ్రామ ఖాతాల నిర్వహణ.
బి) వివిధ ధృవపత్రాల జారీ కోసం విచారణలు నిర్వహించడం.
సి) ప్రభుత్వ భూములు, సరస్సులు మరియు నీటి వనరులపై ఆక్రమణలకు సంబంధించి విచారణలు నిర్వహించడం మరియు వాటి రక్షణను నిర్ధారించడం.
డి) భూమికి సంబంధించిన వివాదాలను పరిశోధించడం మరియు భూమి సర్వేలలో సర్వేయర్లకు సహాయం చేయడం.

ఇ) విపత్తు నిర్వహణకు సంబంధించిన విధులను నిర్వర్తించడం మరియు అవసరమైన/అత్యవసర సేవలను అందించడం.

జీతం
గ్రామ పాలన ఆఫీసర్ (GPO) ఉద్యోగులకు ₹34,000/- పైన నెల జీతం ఇస్తారు.

వయోపరిమితి:
18 సంవత్సరాల నుండి 34 సంవత్సరాల మధ్య ఉండాలి

ఎంపిక విధానం
ఈ నోటిఫికేషన్ పూర్తిగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రాత పరీక్ష డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి :
అన్నీ వివరాల కోసం https://ccla.telangana.gov.in/ వెబ్సైట్ సందర్శించండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *