Press ESC to close

ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ రిక్రూట్మెంట్ – 182 ఇంజినీర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

NTPC Green Energy Recruitment 2025 For 182 Engineer Posts | Apply Online

NTPC Green Energy Recruitment 2025: దిల్లీలోని ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (ఎన్‌జీఈఎల్‌) 182 ఇంజినీర్‌ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది . కాంట్రాక్ట్‌ ప్రాతిపదిన మూడేళ్ల కాలానికి ఎంపిక చేయనున్నారు. మరో రెండేళ్లు పొడిగించే అవకాశం కూడా ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 11.04.2025
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 01.05.2025

ఖాళీలు
ఇంజినీర్‌ (సివిల్‌)-40
ఎలక్ట్రికల్‌-80
మెకానికల్‌-15
కాంట్రాక్ట్‌ అండ్‌ మెటీరియల్‌-10
ఐటీ-4; ఎగ్జిక్యూటివ్‌ (హ్యూమన్‌ రిసోర్స్‌)-7
ఫైనాన్స్‌-26

అర్హత
సివిల్‌/ ఎలక్ట్రికల్‌/ మెకానికల్‌/ ఐటీ/ కాంట్రాక్ట్‌ అండ్‌ మెటీరియల్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ బ్రాంచితో బీఈ/ బీటెక్‌ కలిగి ఉండాలి.

ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు డిగ్రీ, హ్యూమన్‌ రిసోర్సెస్‌/ ఇండస్ట్రియల్‌ రిలేషన్స్‌/ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలైజేషన్‌తో పీజీ/ పీజీ డిప్లొమా పూర్తిచేయాలి.

డిగ్రీ, పీజీలను జనరల్‌ అభ్యర్థులు 60 శాతం మార్కులతో పూర్తిచేయాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు 50 శాతం సరిపోతుంది.
ఎగ్జిక్యూటివ్‌-ఫైనాన్స్‌ పోస్టుకు సీఏ/ సీఎంఏ పూర్తిచేయాలి.

వయసు
30 సంవత్సరాలు మించకూడదు.
ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ళు, మాజీ సైనికోద్యోగులకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణగా వయోసడలింపు ఉంటుంది.

Also Read: Telangana ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ లో 40 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

దరఖాస్తు ఫీజు
ఇతరులకు: రూ.500.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, మహిళలకు ఫీజు లేదు.

జీతం
ఏడాదికి రూ.11 లక్షలు.
అనుభవం, పనిచేసే ప్రాంతాన్ని బట్టి ఇది మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT),
ఇంటర్వ్యూ

ఎగ్జామ్ ప్రక్రియ
సీబీటీకి 70 మార్కులు
అనుభవానికి 10 మార్కులు
ఇంటర్వ్యూకు 20 మార్కులు

సీబీటీలో ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీల్లో భాషల్లో మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ఉంటుంది.
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్
వెర్బల్‌ ఎబిలిటీ
లాజికల్‌ రీజనింగ్
జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నికల్‌ స్కిల్స్‌ (సబ్జెక్టు పరిజ్ఞానం)

తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నంలో పరీక్ష కేంద్రం ఉంటుంది.

Official Website

NTPC Green Energy Recruitment Notification

Also Read: AP పెట్రోలియం యూనివ‌ర్సిటీలో నాన్ టీచింగ్‌ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *