Press ESC to close

తెలంగాణ టెట్ 2025 దరఖాస్తులు ప్రారంభం – పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి

TG TET 2025 Notification Released – Apply Now | tgtet.aptonline.in/tgtet

TG TET 2025 Notification: తెలంగాణ టీచర్ ఎలిజిబులిటి టెస్ట్ షెడ్యూల్‌ ఇటీవల విడుదలైంది. 15-04-2025 నుంచి టెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్ 15 నుంచి 30 వరకు టెట్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది . ఏడాదిలో రెండుసార్లు జూన్‌, డిసెంబర్‌ మాసాల్లో టెట్‌ పరీక్ష నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ జూన్ తర్వాత మళ్లీ డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

TG TET 2025 Notification Schedule

ముఖ్యమైన తేదీలు
నోటిఫికేషన్ విడుదల తేదీ: 11 ఏప్రిల్ 2025
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 15 ఏప్రిల్ 2025
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30 ఏప్రిల్ 2025
హాల్ టికెట్ల డౌన్‌లోడ్: 9 జూన్ 2025 నుండి
పరీక్ష తేదీలు: 15 జూన్ నుండి 30 జూన్ 2025 మధ్య
ఫలితాల ప్రకటన: 22 జూలై 2025

దరఖాస్తు విధానం..
ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలి
చెల్లింపు తర్వాత జర్నల్ నంబర్ వస్తుంది.
జర్నల్ నంబర్ ఉపయోగించి ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ నింపాలి.
స్కాన్ చేసిన ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
దరఖాస్తును సమర్పించి, ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

Official Website:  https://tgtet.aptonline.in/tgtet

దరఖాస్తు రుసుము
ఒక పేపర్‌కు (పేపర్ I Or పేపర్ II) రూ.750/-
రెండు పేపర్‌లకు (పేపర్ I & II) రూ.1000/-

అర్హత
అభ్యర్ధులు ఏదైనా డిగ్రీలో 50 శాతం మార్కులతో పాటు బీఎడ్‌ లేదా స్పెషల్ బీఎడ్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి.

పరీక్ష విధానం: ఆన్‌లైన్‌
కంప్యూటర్ ఆధారిత పరీక్ష -సీబీటీ

క్వశ్చన్ పేపర్ తెలుగు మరియు ఇంగ్లీష్ ప్రశ్నల రూపంలో ఉంటుంది.

ప్రతి పేపర్‌కు 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది.
పరీక్ష సమయం 2 గంటల 30 నిమిషాలు.
నెగెటివ్ మార్కింగ్ లేదు.
పేపర్ I (1 నుండి 5 తరగతుల వరకు ఉపాధ్యాయుల కోసం)..
బాల వికాసం, బోధనా శాస్త్రం
భాష I (తెలుగు, ఉర్దూ, హిందీ)
భాష II (ఆంగ్లం)
గణితం
పరిసరాల అధ్యయనం

పేపర్ II (6 నుండి 8 తరగతుల వరకు ఉపాధ్యాయుల కోసం)..
బాల వికాసం, బోధనా శాస్త్రం
భాష I (తెలుగు, ఉర్దూ, హిందీ)
భాష II (ఆంగ్లం)
గణితం, సైన్స్ లేదా సాంఘిక శాస్త్రం

డీఎస్సీ నియామక పరీక్ష రాసేందుకు టెట్‌లో తప్పనిసరిగా అర్హత సాధించాలనే విషయం తెలిసిందే. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.

Apply Online

TG TET 2025 Notification PDF

 

Also Read: TS TET Previous Year Question Papers With Answers PDF Free Download

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *