Press ESC to close

గాండీవధారి అర్జున సినిమా టైలర్‌ విడుదల

Gandeevadhari Arjuna Trailer Released: టాలీవుడ్ హీరో వరుణ్‌తేజ్‌ నుంచి వస్తున్న మరో సినిమా గాండీవధారి అర్జున. ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందించారు సినీ మేకర్స్‌.బుడాపెస్ట్‌లో వచ్చే హై ఆక్టేన్‌ యాక్షన్‌ సీక్వెన్స్ సినిమాకే హైలెట్‌గా నిలువబోతున్నట్టు ప్రకటించారు. వరుణ్‌తేజ్‌ VT12 ప్రాజెక్ట్‌గా గాండీవధారి అర్జున తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌, గ్లింప్స్‌, టీజర్‌ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. చాలా రోజుల తర్వాత ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ స్పాట్‌లో వరుణ్‌తేజ్‌, ప్రవీణ్‌ సత్తారు చాట్‌ వీడియోను షేర్ చేస్తూ.. ఆగస్టు 10న మధ్యాహ్నం 3 గంటలకుట్రైలర్ లాంఛ్ చేశారు. ది ఘోస్ట్‌ ఫేం ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ తెరకెక్కిస్తున్నారు. యాక్షన్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీకి మిక్కీ జే మేయర్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో ఏజెంట్ ఫేం సాక్షి వైద్య ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. విమలారామన్‌, నాజర్‌, వినయ్‌ రాయ్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటించగా .. మాజీ మిస్ యూనివర్స్‌ మానుషి ఛిల్లార్‌ లీడ్‌ రోల్‌ చేస్తోంది. గాండీవధారి అర్జున ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇక ఈ మూవీ నుంచి విడుదల చేసిన ఫస్ట్ సింగిల్‌ నీ జతై లిరికల్ వీడియో సాంగ్‌ మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. వరుణ్‌ తేజ్‌ దీంతోపాటు VT13లో కూడా నటిస్తున్నాడని తెలిసిందే. పాన్ ఇండియా కథాంశంతో వార్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడ దర్శకత్వం వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *