Indian Air Force Agniveer Vayu Recruitment 2025 Apply Online
అగ్నివీర్ ఎయిర్‌ఫోర్స్‌లో ఖాళీగా ఉన్న మ్యూజిషియన్స్ పోస్టును భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు భర్తీ చేసేందుకు దరఖాస్తులు చేయవచ్చు. ఈ మెరకు రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనుంది సంస్థ.
జూన్ 10 నుంచి జూన్ 18 వరకు బెంగళూరులో ఈ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇందులో, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు పాల్గొనవచ్చు.
అర్హత
అగ్మివీర్‌లో ఖాళీగా ఉన్న మ్యూజీషియన్ పోస్టును భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఏప్రిల్ 21వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ పోస్టుకు జనవరి 2, 2005, జులై 2, 2008 తేదీల మధ్య పుట్టినవారు అర్హలు (రెండు రోజులు కలుపుకొని). భారత వైమానిక దళం నిబంధనల ప్రకారం అగ్నివీర్ వాయు మ్యూజిషియన్ ఇంటెక్ 01/2026 పోస్టుకు వయో సడలింపును అందిస్తుంది.
అభ్యర్థులు గుర్తింపు పొందిన పాఠశాల లేదా బోర్డులో 10వ తరగతిలో కనీస ఉత్తీర్ణత మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
వారికి మంచి సంగీత సామర్థ్యం ఉండాలి, సరైన టెంపో, పిచ్, పూర్తి పాట పాడగల సామర్థ్యం, ట్యూన్ ప్రదర్శించడం, ఏదైనా సంగీత సంజ్ఞామాన వ్యవస్థను ఉపయోగించడం, కనీసం ఒక వాయిద్యాన్ని వాయించడం వంటి అర్హతలు ఉండాలి.
అభ్యర్థులు గుర్తింపు పొందిన సంగీత సంస్థ నుండి గ్రేడ్ 5 లేదా అంతకంటే ఎక్కువ, హిందుస్తానీ లేదా కర్ణాటక సంగీతంలో డిప్లొమా లేదా సంగీత కార్యక్రమాల నుండి సర్టిఫికెట్లు/అవార్డులు వంటి సంగీత అనుభవ ప్రమాణాలను కూడా కలిగి ఉండాలి.
దరఖాస్తుల వివరాలు..
దరఖాస్తు ఫీజు: రూ.100 + GST
విధానం
దరఖాస్తులు, ఫీజు చల్లించడం ఆన్‌లైన్‌లోనే..
అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు చేసుకుని, డెబిట్, క్రెడిట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, క్యాష్ కార్డ్ / మొబైల్ వాలెట్.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుల ప్రారంభం తేదీ: ఏప్రిల్ 21, 2025
దరఖాస్తుల చివరి తేదీ: 11 మే, 2025
రిక్రూట్‌మెంట్ ర్యాలీ- జూన్ 10, 2025 నుంచి జూన్ 18, 2025
జీతం: నెలకు ₹ 30,000/- (Increments Every Year)

Leave a Reply