Google Doodle celebrates India’s Independence Day:
నేడు భారతదేశం 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది. విధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన విభిన్న Textile Crafts సంప్రదాయాలను ప్రదర్శించడం ద్వారా గూగుల్ డూడుల్(Google Doodle) భారతదేశ 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని గుర్తుచేసుకుంది.
ఈ డూడుల్‌ను న్యూ ఢిల్లీకి చెందిన నమ్రత కుమార్ అనే కళాకారిణి రూపొందించారు.
నమ్రత కుమార్ రూపొందించిన ఈ డూడుల్ దేశంలోని గొప్ప, విభిన్నమైన దుస్తుల సంప్రదాయాలను ప్రదర్శిస్తుంది.
Google Home Page Logo తాత్కాలిక మార్పులు ముఖ్యమైన సెలవులు, పండుగలు ఇంకా ప్రముఖ కళాకారులు, మార్గదర్శకులు ఇంకా శాస్త్రవేత్తల వారసత్వాన్ని గౌరవించేలా రూపొందించబడ్డాయి.
వివిధ టెక్స్టైల్ ప్రింట్ల గురించి వివరాలు ఇలా ఉన్నాయి:
1. కచ్ ఎంబ్రాయిడరీ – గుజరాత్
2. పట్టు వీవ్ – హిమాచల్ ప్రదేశ్
3. జమ్దానీ వీవ్ – పశ్చిమ బెంగాల్
4. కుంబీ వీవ్ టెక్స్టైల్ – గోవా
5. ఫైన్ ఇకత్ – ఒడిశా
6. పష్మీనా కనీ వీవ్ టెక్స్టైల్ – జమ్మూ కాశ్మీర్
7. బెనారసి వీవ్ – ఉత్తర ప్రదేశ్
8. పైథాని వీవ్ – మహారాష్ట్ర
9. కాంతా ఎంబ్రాయిడరీ – వెస్ట్ బెంగాల్
10. నాగా వోవెన్ టెక్స్టైల్ – నాగాలాండ్
11. అజ్రఖ్ బ్లాక్ ప్రింటింగ్ – కచ్, గుజరాత్
12. అపటానీ వీవ్ – అరుణాచల్ ప్రదేశ్
13. ఫుల్కారీ వీవ్ – పంజాబ్
14. లెహెరియా రెసిస్ట్ పంజాబ్ డైడ్ టెక్స్టైల్- రాజస్థాన్
15. కంజీవరం – తమిళనాడు
16. సుజ్ని వీవ్ – బీహార్
17. బంధాని రెసిస్ట్ డైడ్ – గుజరాత్, రాజస్థాన్
18. కసావు వీవ్ టెక్స్టైల్ – కేరళ
19. ఇల్కల్ హ్యాండ్లూమ్ – కర్ణాటక
20. మేఖేలా చాదర్ వీవ్ – అస్సాం
21. కలంకారి బ్లాక్ ప్రింట్ – ఆంధ్రప్రదేశ్

Leave a Reply