AP Koushalam Survey – Work From Home Jobs | Apply Process
AP Koushalam Survey – Work From Home Jobs: ఆంధ్రప్రదేశ్లోని (AP) నిరుద్యోగ యువతకు శుభవార్త. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం (AP Govt) వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేపడుతున్న సంగతి తెలిసిందే.
కౌశలం పేరుతో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేపడుతున్నారు. అయితే సచివాలయ సిబ్బంది ద్వారా ఈ సర్వే ఇన్ని రోజులు చేపట్టారు.
అయితే తాజాగా సచివాలయ ఉద్యోగులతో పాటుగా ఆసక్తి గలవారు.. స్వయంగా కౌశలం సర్వేలో పాల్గొనేలా మార్పులు చేశారు. ప్రజలే స్వయంగా సర్వే పూర్తి చేసుకునే అవకాశం కల్పించారు. నిరుద్యోగులను గుర్తించి, వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కౌశలం సర్వే నిర్వహిస్తోంది.
నిరుద్యోగులు, విద్యార్థుల నైపుణ్య స్థాయిలను ఈ సర్వే ద్వారా అంచనా వేసి.. వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా ఉద్యోగాలను కల్పించడం కౌశలం సర్వే ( వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే) ప్రధాన ఉద్దేశం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా నుంచి పీజీ వరకు చదివినవారు కౌశలం సర్వేలో నమోదు చేసుకోవచ్చు. కౌశలం సర్వేలో పాల్గొన్న వారి అర్హతలను అనుసరించి ప్రభుత్వం నుంచి నైపుణ్య అభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు రచించారు.
How to Apply For Koushalam Survey
కౌశలం సర్వేలో స్వయంగా పాల్గొనాలనుకునేవారు.. https://gsws-nbm.ap.gov.in/BM/Koushalam అనే పోర్టల్లోకి వెళ్లి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.
దీనిపై క్లిక్ చేయగానే.. హోం పేజీ తెరుచుకుంటుంది. అందులో సిటిజన్ సర్వీస్ ఆన్ లైన్ పోర్టల్, వర్క్ ఫ్రమ్ హోం మాడ్యూల్ అని ఉంటాయి.
వర్క్ ఫ్రమ్ హోమ్ మాడ్యూల్ మీద క్లిక్ చేయగానే ఆధార్ కార్డు వివరాలు అడుగుతుంది.
ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే OTP వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేశాక సర్వే ఓపెన్ అవుతుంది.
అందులో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా వెరిఫై చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత మెయిల్ ఐడీ, చదివిన కోర్సు, సబ్జెక్ట్స్ , కాలేజీ వివరాలు నమోదు చేయాలి.అలాగే percentage/GPA వివరాలు నమోదు చేసిన తర్వాత ఆ కోర్సులకు సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
అయితే పదో తరగతి, ఇంటర్మీడియట్ మాత్రమే చదువుకున్న విద్యార్థులు ఎలాంటి సర్టిఫికేట్లు అప్ లోడ్ చేయాల్సిన అవసరం లేదని అధికారులు చెప్తున్నారు.
Required Documents for AP Koushalam Survey – Work From Home Jobs
ఆధార్ కార్డ్
ఆధార్ కి లింక్ కాబడిన ఫోన్
ఈమెయిల్ ఐడి
విద్యార్హత సర్టిఫికెట్
ఇతర ఏమైనా సర్టిఫికెట్లు
విద్య ను అభ్యసించిన కాలేజ్ వివరాలు
మీ యొక్క ప్రాధమిక వివరాలు (పూర్తి పేరు , డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క జిల్లా) సరిచూసుకోండి.
Click Here To Apply For AP Koushalam Survey – Work From Home Jobs

Leave a Reply