Press ESC to close

APPSC Thanedar Notification 2025 : AP తానెదార్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. ఎవరు అర్హులు..?

APPSC Thanedar Notification 2025 | Apply Online

APPSC Thanedar Notification 2025: ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్‌లో తానెదార్ పోస్టుల భర్తీకి APPSC ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టుల సంఖ్య: 10

వయోపరిమితి: 01.07.2025 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్ https://psc.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు తేదీలు:
దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్ 11, 2025 నుంచి అక్టోబర్ 1, 2025 రాత్రి 11:00 గంటల వరకు ఉంటుంది.

AP Thanedar Recruitment 2025




విద్యార్హత
అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

జీతం : ఈ పోస్టులకు ఎంపికైన వారికి రూ. 20,600 – 63,660/- జీతం ఉంటుంది.

శారీరక ప్రమాణాలు….
పురుష అభ్యర్థులకు కనీస ఎత్తు 163 సెం.మీ., ఛాతీ సాధారణ స్థితిలో 84 సెం.మీ., గాలి పీల్చినప్పుడు 5 సెం.మీ. పెరగాలి.
మహిళా అభ్యర్థులకు కనీస ఎత్తు 150 సెం.మీ., ఛాతీ సాధారణ స్థితిలో 79 సెం.మీ., గాలి పీల్చినప్పుడు 5 సెం.మీ. పెరగాలి.
గూర్ఖాలు, నేపాలీలు, అస్సామీలు, నాగా, మణిపురి, సిక్కిమీస్, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారికి ఎత్తులో 5 సెం.మీ. సడలింపు ఉంటుంది.




షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థులు తగిన సంఖ్యలో లేకపోతే, వారికి కనీస ఎత్తు 158 సెం.మీ., ఛాతీ సాధారణ స్థితిలో 78.8 సెం.మీ. మరియు గాలి పీల్చినప్పుడు 5 సెం.మీ. పెరగాలి.

AP Thanedar Recruitment 2025 Notification PDF

Apply Online For AP Thanedar Recruitment 2025

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *