7వ తరగతి అర్హతతో తెలంగాణ సింగరేణి కోల్ మైన్స్‌లో మహిళలకు ఉద్యోగాలు
తెలంగాణలోని సింగరేణి కోల్ మైన్స్ కంపెనీ చరిత్రలోనే తొలిసారి మహిళలకు మైనింగ్ రంగంలో భారీ యంత్రాల ఆపరేటర్ పోస్టులు ఇవ్వబోతున్నది.
గరేణి సీఎండీ ఎన్. బలరాం వెల్లడించిన వివరాల ప్రకారం –
అర్హత: కనీసం 7వ తరగతి పాస్ అయి ఉండాలి.
వయస్సు పరిమితి: 35 ఏళ్ల లోపు మహిళా ఉద్యోగులు మాత్రమే దరఖాస్తు చేయవచ్చు.
డ్రైవింగ్ లైసెన్స్: రెండు చక్రాలు లేదా నాలుగు చక్రాల వాహనాలు నడిపే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. (2024 ఆగస్ట్‌కు ముందే లైసెన్స్ పొందిన వారికి ప్రాధాన్యం).
శారీరక సామర్థ్యం: బలమైన శారీరక సామర్థ్యం ఉండాలి.
దరఖాస్తు చేసే మహిళా ఉద్యోగులు గని మేనేజర్, డిపార్ట్‌మెంట్ హెడ్ లేదా జనరల్ మేనేజర్‌కు అప్లికేషన్లు సమర్పించాలి.
ఎంపిక ప్రక్రియలో:
ప్రత్యేక కమిటీ ముందుగా అప్లికేషన్లను పరిశీలిస్తుంది.
ఎంపికైన వారికి సిరిసిల్లలోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్లో ట్రైనింగ్ ఇస్తారు.
ట్రైనింగ్ తర్వాత పరీక్ష నిర్వహించి, ఉత్తీర్ణులైన వారిని సీనియర్ ఎపీ ఆపరేటర్ ట్రైనీ కేటగిరీ-5 పోస్టులకు నియమిస్తారు.
ఈ నిర్ణయంతో సింగరేణి సంస్థ మహిళా సాధికారత దిశగా కొత్త చరిత్ర సృష్టించింది. ఆసక్తి, అర్హత కలిగిన మహిళా ఉద్యోగులు వెంటనే అప్లై చేయాలని యాజమాన్యం పిలుపునిచ్చింది.

Leave a Reply