Press ESC to close

“మెకానిక్ రాకీ” ట్రైలర్ – మాస్ అండ్ ఎంటర్టైనింగ్

Mechanic Rocky Trailer: విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా న‌టిస్తున్న ‘మెకానిక్ రాకీ’ మూవీ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. కామెడీ, లవ్, యాక్షన్ సీన్స్ తో ఉన్న ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. సునీల్ ఇందులో విలన్ రోల్ చేశారు.

రిపేరుకు వస్తే ఫ్రీగా సర్వీసింగ్ చేస్తా, సౌండ్ ఎక్కువస్తే బోర్ చేస్తా, అంతకుమించి మొండికేస్తే ఒక్కొక్కడి ఇంజన్ తీసి గూష్మండంలో బిగిస్తా’ అని విశ్వక్ సేన్.. సునీల్ కు ఇచ్చే వార్నింగ్ సీన్ ట్రైలర్ మొత్తానికే హైలైట్.. మొత్తంగా ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ ను బట్టి చూస్తే ఇదొక పక్కా మాస్ కమర్షియల్ బొమ్మ అని అర్థమవుతుంది.

జేక్స్ బిజోయ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తుండగా. నవంబర్ 22న సినిమా రిలీజ్ కి రాబోతుంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *