Press ESC to close

Isro Next Projects : చంద్రయాన్‌-3 తరువాత ఇస్రో నుండి రాబోయే ప్రాజెక్ట్స్

Isro Next Projects:

ఇస్రో (ISRO) సరికొత్త చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతోంది. జాబిల్లి రహస్యాలను చేధించేందుకు చంద్రయాన్‌-3 (Chandrayaan 3) ని ప్రయోగించిన ISRO ..మరో ముందడుగు వేయబోతోంది. తొలిసారిగా సూర్యుడిపై పరిశోధన కోసం ‘ఆదిత్య-ఎల్‌1’ (Aditya-L1)ని నింగిలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది రత అంతరిక్ష పరిశోధన సంస్థ . ఇప్పటికే ఈ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రానికి తీసుకొచ్చారు. September మొదటివారంలో PSLV-సి57 రాకెట్‌ ద్వారా దీన్ని ప్రయోగిస్తారు.ఈ వ్యోమనౌక సుమారు 1,500 కిలోల బరువు ఉంటుంది.





ఆదిత్య ఎల్–1లో మొత్తం 7 పేలోడ్లు వుంటాయి. ఫోటోస్పియ‌ర్‌ (Photosphere), క్రోమోస్పియ‌ర్‌ను అధ్యయనం చేసేందుకు 7 పేలోడ్స్‌తో ఆ ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లనుంది. భూమికి 15 లక్షల KM దూరంలోని లాగ్రాంజ్‌ పాయింట్‌ 1..అంటే L-1చుట్టూ ఉన్న కక్ష్యలో దీన్ని ప్రవేశపెడతారు. అక్కడి నుంచి గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుణ్ణి నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలవుతుంది. సౌర కార్యకలాపాలు, అంతరిక్ష వాతావరణంలో దాని ప్రభావం, సౌర తుపాన్ల సమయంలో జరిగే మార్పులపై స్టడీ చేయనున్నారు. సూర్యుడి ఉపరితలంపై కూడా పరిశోధనలు చేయనున్నారు.

మొదటి మానవ సహిత అంతరిక్ష విమానం

ఇస్రో భారతదేశం యొక్క మొట్టమొదటి మానవ అంతరిక్ష విమాన మిషన్‌పై పని చేస్తోంది, ఇది ముందుగా 2020కి షెడ్యూల్ చేయబడింది, అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా ఆలస్యం అయింది. “గగన్యాన్ ప్రాజెక్ట్ 3 రోజుల మిషన్ కోసం 400 కిమీల కక్ష్యలో 3 సభ్యుల సిబ్బందిని ప్రవేశపెట్టడం ద్వారా మరియు భారతీయ సముద్ర జలాల్లో ల్యాండ్ చేయడం ద్వారా వారిని సురక్షితంగా భూమికి తీసుకురావడం ద్వారా మానవ అంతరిక్ష ప్రయాణ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది” అని ఇస్రో తెలిపింది. మానవ సహిత విమానానికి ముందుగా రెండు మానవ రహిత విమానాలు ఉంటాయి. “వచ్చే సంవత్సరం ప్రారంభంలో మానవరహిత క్రూ మాడ్యూల్ మిషన్‌కు (రెండింటిలో మొదటిది) మేము సిద్ధంగా ఉన్నాము” అని ఇస్రో అధికారి ఒకరు తెలిపారు, వార్తా సంస్థ PTI ప్రకారం.

Also Read: పోటీ పరీక్షల ప్రత్యేకం – Important Points On Chandrayaan-3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *