
DRDO SAG Delhi Paid Internship for Engineering/ Science UG & PG Students Apply Now
DRDO Paid Internship : భారత రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని సైంటిఫిక్ అనాలిసిస్ గ్రూప్ డీఆర్డీఓ(ఎస్ఏజీ డీఆర్డీఓ) పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 18.
పోస్టులు : 24
ఇంజినీరింగ్ విభాగాలు:
సీఎస్/ఏఐ/ఐఎస్ఈ/సైబర్ సెక్యూరిటీ 17
ఎలక్ట్రానిక్స్/ ఈసీఈ/ఈఐఈ 04
ఫిజిక్స్ 02
మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్ 01
ఎలిజిబిలిటీ
అండర్ గ్రాడ్యుయేట్: ఖాళీలను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ / బి.టెక్. నాలుగో సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు అర్హులు.
పోస్ట్ గ్రాడ్యుయేట్: సంబంధిత విభాగంలో ఎం.ఈ/ఎం.టెక్/ఎంఎస్సీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు అర్హులు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
Also Read: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో అప్రెంటిస్ పోస్టులు .. మెరిట్ ఆధారంగా ఎంపిక
లాస్ట్ డేట్ డిసెంబర్ 18.
సెలెక్షన్ ప్రాసెస్:
అభ్యర్థుల ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా ఉంటుంది. మంచి అకడమి క్ రికార్డ్ (కనీసం 75 శాతం లేదా 7.5 సీజీపీఏ కంటే ఎక్కువ మార్కులు) ఉన్న విద్యార్థులకు పెయిడ్ ఇంటర్న్‌షిప్‌ను అందజేస్తారు. సీజీపీఏ/ఇంటర్వ్యూ/ ఇంటరాక్షన్ ఆధారంగా విద్యార్థుల ను ఎంపిక చేస్తారు.
స్టైఫండ్ చెల్లింపు: ప్రతి నెలా పని దినాల్లో కనీసం 15 రోజులు ల్యాబ్ హాజరైన విద్యార్థులకు మాత్రమే స్టైఫండ్ చెల్లిస్తారు. ఇంటర్న్‌షిప్ మూడో. ఆరో నెల పూర్తయిన తర్వాత మొత్తం స్టైఫండ్ (నెలకు రూ.15,000 చొప్పున) రెండు సమాన వాయిదాల్లో చెల్లిస్తారు.
దరఖాస్తుల సమర్పణ విధానం:
a. ఈ-మెయిల్ (saghr.sag@gov.in) ద్వారా మాత్రమే అందిన దరఖాస్తు అంగీకరించబడుతుంది.
b. ఈ-మెయిల్లో ఈ సబ్జెక్టు గురించి స్పష్టంగా “పెయిడ్ ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు – జనవరి 2026” అని పేర్కొనాలి
బ్రాంచ్ కోడ్ మరియు బ్రాంచ్/క్రమశిక్షణతో డైరెక్టర్, సైంటిఫిక్ అనాలిసిస్ గ్రూప్ (SAG)కి సంబోధించాలి.
c. కింది పత్రాల స్కాన్ చేసిన కాపీలు జతచేయబడ్డాయి:-
i. అన్ని విధాలుగా నింపిన దరఖాస్తు ఫారం.
ii. కళాశాల నుండి అభ్యంతర ధృవీకరణ పత్రం లేదు (అనుబంధం-I ప్రకారం).
iii. 10వ మార్కు షీట్.
iv. 12వ తరగతి / డిప్లొమా మార్కు షీట్
v. పూర్తయిన అన్ని సెమిస్టర్ల (BE/B.Tech/M.E/M.Tech/M.Sc) మార్కు షీట్లు.
vi. ఆధార్ కార్డ్.
vii. కళాశాల ID కార్డ్

Leave a Reply