Press ESC to close

Union Budget Of India 2026 Highlights | Nirmala Sitaraman

Union Budget Of India 2026 Highlights

    • బయో ఫార్మా రంగానికి రూ.10 వేల కోట్లు
    • ఏపీ, ఒడిశా, తమిళనాడు, కేరళలో గనుల కారిడార్
    • మూడు డెడికేటెడ్ కెమికల్ పార్క్‌ల నిర్మాణం
    • ప్రస్తుతమున్న NIPERs ఆధునీకరణ
    • దేశంలో 2 హైటెక్ టెక్నాలజీ రూమ్స్‌ ఏర్పాటు
    • కంటైనర్ నిర్మాణ రంగానికి రూ.10 వేల కోట్లు
    • దేశంలో కొత్తగా మూడు కెమికల్ రీసెర్చ్ పార్కులు
    • సెమీకండక్టర్ మిషన్ కోసం రూ.40 వేల కోట్లు
    • జౌళి రంగానికి కేంద్ర బడ్జెట్‌లో చేయూత
    • మెగా టెక్స్‌టైల్ పార్క్‌ నిర్మాణం
    • సెమీ కండక్టర్ మిషన్ 2.O ప్రారంభం

  • త్వరలో నేషనల్ ఫైబర్ స్కీమ్ ప్రారంభం
  • టెక్స్‌టైల్‌ రంగం అభివృద్ధికి కొత్త పథకం
  • దేశంలో కొత్త మెగా టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటు
  • ఖాదీ, హ్యాండ్లూమ్‌, హస్తకళల ప్రోత్సాహానికి పథకం
  • అత్యంత నాణ్యత కలిగిన క్రీడా వస్తువుల తయారీకి పథకం
  • 200 పారిశ్రామిక క్లస్టర్స్‌ ఆధునీకరణకు చేయూత
  • ఆత్మనిర్భర్‌ భారత్‌కు రూ.2 వేల కోట్లు
  • SME రంగానికి రూ.10 వేల కోట్లు
  • మైక్రో సెక్టార్‌కు రూ.2 వేల కోట్లు
  • ఆత్మనిర్భర్‌ భారత్‌కు రూ.2 వేల కోట్లు 
  • SME రంగానికి రూ.10 వేల కోట్లు
  • మైక్రో సెక్టార్‌కు రూ.2 వేల కోట్లు
  • ఆత్మనిర్భర్‌ భారత్‌కు రూ.2 వేల కోట్లు
  • పుణే- హైదరాబాద్‌ మధ్య హైస్పీడ్‌ రైల్‌ కారిడర్‌
  • హైదరాబాద-బెంగళూరు మధ్య హైస్పీడ్‌ రైల/ కారిడర్‌ ఏర్పాటు
  • ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రిస్క్‌ ఫండ్‌ ఏర్పాటు
  • సీపీఎస్‌ఈల కోసం ప్రత్యేకమైన హక్కులు
  • కొత్తగా డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడర్‌ ఏర్పాటు
  • బెంగాల్‌ నుంచి గుజరాత్‌ వరకు కారిడర్‌ ఏర్పాటు
  • వారణాసి, పట్నాలో షిఫ్‌ రిపేరింగ్‌ సెంటర్ల ఏర్పాటు
  • వచ్చే ఐదేళ్లలో కొత్తగా 20 జలమార్గాల అభివృద్ధి

యూనియన్ బడ్జెట్ (Full Budget) అంటే ఏమిటి?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు) ప్రభుత్వం చేసే ఖర్చులు , వచ్చే ఆదాయం యొక్క పూర్తి నివేదికనే ‘యూనియన్ బడ్జెట్’ అంటారు. ఇందులో విద్యా, వైద్యం, రక్షణ , మౌలిక సదుపాయాల కల్పన వంటి రంగాలకు నిధుల కేటాయింపులతో పాటు, కొత్త పన్ను విధానాలు , భారీ సంస్కరణలను ప్రభుత్వం ప్రకటిస్తుంది.

మధ్యంతర బడ్జెట్ (Interim Budget) అంటే ఏమిటి?
సాధారణ ఎన్నికలు దగ్గరలో ఉన్నప్పుడు లేదా కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టే ముందు ‘మధ్యంతర బడ్జెట్’ ను ప్రవేశపెడతారు. కొత్త ప్రభుత్వం వచ్చే వరకు పాలన సాఫీగా సాగడానికి, జీతాలు , ఇతర అత్యవసర ఖర్చుల కోసం పార్లమెంటు నుండి అనుమతి పొందే ప్రక్రియ ఇది. దీనిని ‘వోట్ ఆన్ అకౌంట్’ అని కూడా అంటారు. సాధారణంగా ఇందులో పెద్ద పెద్ద పాలసీ మార్పులు లేదా కొత్త స్కీమ్‌ లు ఉండవు.

ప్రధాన వ్యత్యాసాలు ఇవే.. కాలపరిమితి: మధ్యంతర బడ్జెట్ కేవలం 2 నుండి 4 నెలల తాత్కాలిక అవసరాల కోసం ఉద్దేశించినది. కానీ, బడ్జెట్ (Budget 2026) వంటి పూర్తి స్థాయి బడ్జెట్ ఏడాది పొడవునా అమలులో ఉంటుంది.

మధ్యంతర బడ్జెట్‌లో భారీ పన్ను మార్పులు చేయకూడదనే సంప్రదాయం ఉంది. అదే యూనియన్ బడ్జెట్‌లో ఆదాయపు పన్ను స్లాబుల మార్పు వంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

ఆమోదం: మధ్యంతర బడ్జెట్‌ను లోక్‌సభలో మాత్రమే చర్చిస్తారు. కానీ, పూర్తి బడ్జెట్ ఉభయ సభల్లోనూ సుదీర్ఘ చర్చల తర్వాత ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ బడ్జెట్ (Budget 2026) ఎందుకు కీలకం? ఈ ఏడాది బడ్జెట్‌కు ఎలాంటి ఎన్నికల పరిమితులు లేవు. కాబట్టి ప్రభుత్వం ఆర్థిక వృద్ధిని పెంచే దిశగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మౌలిక సదుపాయాల కోసం మూలధన వ్యయం (Capex) పెంచడం, ద్రవ్య లోటును అదుపులో ఉంచడం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది.

యూనియన్‌ బడ్జెట్: ప్రభుత్వ ఆర్థిక స్థితిని సమగ్రంగా వివరించే నివేదిక. ఆదాయ వనరులు, వ్యయాలు, రాబోయే ఆర్థిక సంవత్సరానికి అంచనాలు ఇందులో ఉంటాయి.

బడ్జెట్‌ రోజు నిర్మలమ్మ పలికే పదాలివే

ఫిస్కల్‌ పాలసీ (విత్త విధానం): వ్యయం, పన్నుల ద్వారా ఆర్థిక వ్యవస్థను నియంత్రించేందుకు ప్రభుత్వం అనుసరించే విధానం. ఇది బడ్జెట్ ద్వారా అమలవుతుంది.

ఇన్‌ఫ్లేషన్‌ (ద్రవ్యోల్బణం): వస్తువులు, సేవల ధరలు కాలక్రమేణా పెరగడాన్ని ద్రవ్యోల్బణం అంటారు. దీని వల్ల కొనుగోలు శక్తి తగ్గుతుంది.

మానిటరీ పాలసీ (Monetary Policy): డబ్బు సరఫరా, వడ్డీ రేట్లు, రుణ పరిస్థితులను నియంత్రించేందుకు కేంద్ర బ్యాంకు (ఆర్‌బీఐ) తీసుకునే చర్యలు.

బడ్జెట్ ఎస్టిమేట్స్‌ (Budget Estimates): రాబోయే ఆర్థిక సంవత్సరానికి మంత్రిత్వ శాఖలు, పథకాలకు కేటాయించిన నిధుల అంచనాలు.

రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌ (Revised Estimates): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మధ్యలో వాస్తవ పరిస్థితులను బట్టి సవరించిన ఆదాయం–వ్యయాల అంచనాలు.

రెవెన్యూ బడ్జెట్: ప్రభుత్వ రెవెన్యూ వసూళ్లు (పన్ను, పన్నుయేతర ఆదాయం), రెవెన్యూ వ్యయాలను చూపుతుంది.

క్యాపిటల్ బడ్జెట్: మూలధన వసూళ్లు, మూలధన వ్యయాలకు సంబంధించిన వివరాలు ఇందులో ఉంటాయి.

ఫినాన్స్‌ బిల్‌ (ఆర్థిక బిల్లు): బడ్జెట్‌లో ప్రతిపాదించిన పన్నుల మార్పులను అమలు చేయడానికి రూపొందించే చట్టప్రతిపాదన.

క్యాపిటల్‌ ఎక్స్‌పెండీచర్‌ (మూలధన వ్యయం): ఆస్తుల కొనుగోలు, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడులు వంటి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం చేసే ఖర్చు.

రెవెన్యూ ఎక్స్‌పెండీచర్‌ (రెవెన్యూ వ్యయం): జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు వంటి తక్షణ వినియోగ ఖర్చులు.

ఫిస్కల్‌ డెఫిసిట్‌ (ద్రవ్యలోటు): ప్రభుత్వ మొత్తం వ్యయం, రుణం కాని వసూళ్ల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఏర్పడే లోటు.

ప్రైమరీ డెఫిసిట్‌ (ప్రాథమిక లోటు): ద్రవ్యలోటు నుంచి వడ్డీ చెల్లింపులను మినహాయించిన మొత్తం.

రెవెన్యూ డెఫిసిట్‌ (రెవెన్యూ లోటు): రెవెన్యూ వ్యయం, రెవెన్యూ వసూళ్ల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఏర్పడుతుంది.

గ్రాస్‌ ఫిస్కల్‌ డెఫిసిట్‌ (స్థూల ద్రవ్యలోటు): ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి అవసరమైన మొత్తం రుణ పరిమాణం.

నెట్‌ ఫిస్కల్‌ డెఫిసిట్‌ (నికర ద్రవ్యలోటు): ప్రభుత్వం ఇచ్చే నికర రుణాలను మినహాయించిన ద్రవ్యలోటు.

క్యాపిటల్‌ రిసీట్స్‌ (మూలధన వసూళ్లు): రుణాలు, పెట్టుబడుల ఉపసంహరణ, రుణ రికవరీలు మొదలైనవి.

రెవెన్యూ రిసీట్స్‌ (రెవెన్యూ వసూళ్లు): పన్నులు, పన్నుయేతర వనరుల ద్వారా వచ్చే ఆదాయం.

డైరెక్ట్‌ ట్యాక్స్‌ (ప్రత్యక్ష పన్నులు): ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను వంటి నేరుగా ప్రభుత్వానికి చెల్లించే పన్నులు.

ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్స్‌ (పరోక్ష పన్నులు): జీఎస్టీ వంటి వస్తువులు, సేవలపై విధించే పన్నులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *