
Telangana Tourist Guides 2026: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్… రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల నుంచి టూరిస్ట్ గైడ్‌ల కోసం రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. పర్యాటక రంగంపై ఆసక్తి ఉండి, డిగ్రీ పూర్తి చేసినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.4
మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండి… పురావస్తు శాస్త్రం, చరిత్ర, వారసత్వం, సంస్కృతి, కళ, ఆర్కిటెక్చర్, పర్యాటకం పట్ల ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం గూగుల్ డాక్స్ ఫామ్ పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా https://docs.google.com/forms/u/0/d/e/1FAIpQLSdfLenWj-5csepK7CfawDDJEWC21PJaGbDjT8M0wsYS8k_9ww/closedform లింక్ మీద క్లిక్ చేయాలి. ఈ ఫామ్‌ను జాగ్రత్తగా పూరించి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
ముఖ్య వివరాలు (Key Details)
-
మొత్తం జిల్లాలు: తెలంగాణలోని అన్ని 33 జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
-
బడ్జెట్ కేటాయింపు: ఈ టూరిస్ట్ గైడ్ శిక్షణ మరియు రిక్రూట్‌మెంట్ ప్రోగ్రామ్ కోసం ప్రభుత్వం ₹5 కోట్లు కేటాయించింది.
-
ముఖ్య ఉద్దేశం: స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, పర్యాటకులకు తెలంగాణ సంస్కృతి, చరిత్రను అద్భుతంగా వివరించడం.
🎓 అర్హతలు (Eligibility Criteria)
-
విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ (Graduation) పూర్తి చేసి ఉండాలి.
-
ఆసక్తి రంగం: చరిత్ర (History), పురావస్తు శాస్త్రం (Archaeology), సంస్కృతి, కళలు, ఆర్కిటెక్చర్ మరియు పర్యాటక రంగాలపై ప్రత్యేక ఆసక్తి ఉండాలి.
-
నైపుణ్యాలు: మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ (చక్కగా మాట్లాడగలిగే నైపుణ్యం) మరియు భాషా నైపుణ్యాలు ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
Application For Telangana Tourist Guides 2026
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdfLenWj-5csepK7CfawDDJEWC21PJaGbDjT8M0wsYS8k_9ww/viewform
How To Apply For Telangana Tourist Guide Jobs
>> మీ ఫోన్‌లో/డెస్క్‌టాప్‌లో ఈమెయిల్ ఐడీ సైన్ ఇన్ చేసి ఉంటే… అది అక్కడ కనిపిస్తుంది. అప్పుడే పక్కనే ఉన్న చెక్ బాక్స్ మీద క్లిక్ చేయాలి.
>> ఆ తర్వాత మీరు ఏ జిల్లాకు దరఖాస్తు చేస్తున్నారో ఎంచుకోవాలి.
>> తర్వాత మీ పూర్తి పేరు, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.
>> మీ జెండర్ ఎంచుకోవాలి.
>> వాట్సాప్ ఉన్న ఫోన్ నంబర్‌ను అందించాల్సి ఉంటుంది.
>> ఈమెయిల్ ఐడీ వివరాలు కూడా ఎంటర్ చేయాలి.
>> ఆ తర్వాత అడ్రస్ వివరాలు ఎంటర్ చేసి… ఇందుకు సంబంధించి ప్రూఫ్‌ను అప్‌లోడ్ చేయాలి (ఆధార్ కార్డు వంటివి)
>> విద్యార్హతను ఎంచుకోవాల్సి ఉంటుంది.
>> డిగ్రీ స్ట్రీమ్ లేదా స్పెషలైజేషన్ వివరాలు ఎంటర్ చేయాలి
>> అలాగే యూనివర్సిటీ, ఇనిస్టిట్యూట్ వివరాలను కూడా నమోదు చేయాలి.
>> ఏ ఇయర్‌లో పాస్ అయ్యారనే వివరాలు కూడా అందించాలి.
>> మీకు ఏయో భాషలు వచ్చో సెలక్ట్ చేసుకోవాలి.
>> అంతేకాకుండా మీ కమ్యూనికేషన్ స్కిల్స్‌కు 1 నుంచి 5 మధ్య సెల్ఫ్ రేటింగ్ ఇచ్చుకోవాలి.
>> మీకు ఈ ఫీల్డ్‌లో ముందుగా ఏమైనా ఎక్స్‌పీరియెన్స్ ఉంటే యస్ అని, లేకుంటే నో సెలక్ట్ చేసుకోవాలి.
>> ఒకవేళ మీకు ఏదైనా ఎక్స్‌పీరియెన్స్ ఉంటే, ఆ వివరాలు నమోదు చేయాలి.
>> టూరిస్ట్ గైడ్ పోగ్రామ్‌లో ఎందుకు జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారో తెలియజేయాలి.
>> ఒక పాస్‌పోర్టు సైజ్ ఫొటో, డిగ్రీ సర్టిఫికెట్ అప్‌లోడ్ చేయాలి.
>> చివరగా అన్ని వివరాలను ఒకసారి చెక్ చేసుకోవాలి.
>> ఎలాంటి తప్పులు లేవని నిర్దారించుకున్న తర్వాత డిస్‌క్లైమర్ వద్ద చెక్ బాక్స్ క్లిక్ చేసి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.

Leave a Reply