Press ESC to close

తెలంగాణాలో 1,500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్.. టెన్త్ మార్కులతోనే ఎంపిక

TGRTC Conductor Jobs Notification 2026 – 1500 Posts

TGRTC Conductor Jobs Notification 2026: తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త . రాష్ట్రవ్యాప్తంగా 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయడానికి తెలంగాణ ఆర్టీసీ (TGRTC) యాజమాన్యం సన్నాహాలు ప్రారంభించింది. 10వ తరగతి మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపికను చేపట్టనున్నట్లు సమాచారం.

TSRTC Conductor Jobs 




పదవ తరగతి మార్కులతోనే ఎంపిక
రాత పరీక్ష లేకుండా అభ్యర్థుల SSC మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక నోటిఫికేషన్లో పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

గ్రేడింగ్ విధానంపై స్పష్టత కోరిన TGఆర్టీసీ
అయితే అభ్యర్థుల ఎంపికలో ఒక సమస్య ఎదురవుతోంది. గతంలో పదో తరగతి ఫలితాలు మార్కుల రూపంలో విడుదల కాగా, తరువాతి సంవత్సరాల్లో గ్రేడింగ్ విధానం అమల్లోకి వచ్చింది. దీంతో కొందరి మార్కుల మెమోల్లో మార్కులు ఉండగా, మరికొందరివి గ్రేడింగ్ పాయింట్ల రూపంలో ఉన్నాయి.




ఈ నేపథ్యంలో గ్రేడింగ్ను మార్కుల శాతంగా ఎలా మార్చాలి? అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని TSRTC యాజమాన్యం ఎస్సెస్సీ బోర్డుకు లేఖ రాసింది. బోర్డు నుంచి మార్గదర్శకాలు వచ్చిన తర్వాతే తుది ఎంపిక విధానాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *