Press ESC to close

SBI ఆశా స్కాలర్షిప్ 2026- 20 లక్షల వరకు ఆర్థిక సాయం | అర్హత: 9వ తరగతి నుండి PG

SBI Platinum Jubilee Asha Scholarship 2026 – 15 Thousand to 2 Lakhs Scholarship Apply Online Now

SBI Platinum Jubilee Asha Scholarship 2026: భారతదేశంలో ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం SBI ప్లాటినం జూబిలీ ఆశా స్కాలర్‌షిప్ 2026 (SBI Platinum Jubilee Asha Scholarship 2026).




ఈ పథకం ద్వారా పాఠశాల స్థాయి విద్యార్థుల నుండి విదేశాల్లో ఉన్నత విద్య (Overseas PG) అభ్యసించే వారి వరకు రూ. 15,000 నుండి గరిష్టంగా రూ. 20,00,000 వరకు ఆర్థిక సహాయం పొందవచ్చు.

పథకం పేరు : SBI ప్లాటినం జూబిలీ ఆశా స్కాలర్‌షిప్ 2026
నిర్వహణ సంస్థ : ఎస్‌బిఐ ఫౌండేషన్
అర్హత: 9వ తరగతి నుండి PG, MBBS, IIT, IIM మరియు విదేశీ విద్య విద్యార్థులు
ఆర్థిక సాయం : ₹15,000 నుండి ₹20,00,000 వరకు ప్రతి సంవత్సరం
చివరి తేదీ : సెప్టెంబర్ 4, 2026

 

ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుల ప్రారంభ తేదీ : జూలై 22, 2026
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 4, 2026

SBI Platinum Jubilee Asha Scholarship 2026

స్కూల్ విద్యార్థులు: 9వ తరగతి నుండి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి ₹15,000 వరకు ఆర్థిక సాయం లభిస్తుంది.
డిగ్రీ విద్యార్థులు : NIRF Top 300 లేదా NAAC ‘A’ గ్రేడ్ పొందిన కళాశాలల్లో డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి ₹75,000 వరకు లభిస్తుంది.
పోస్ట్ గ్రాడ్యుయేషన్: పీజీ కోర్సులు అభ్యసిస్తున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఏడాదికి ₹2,50,000 వరకు లభిస్తుంది.
మెడికల్ విద్యార్థులు: AIIMS లేదా NIRF Top 50 ర్యాంక్ సాధించిన వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ చదువుతున్న వారికి ఏడాదికి ₹4,50,000 వరకు అందజేస్తారు.
ఐఐటీ విద్యార్థులు: ప్రతిష్టాత్మక ఐఐటీలలో ఇంజనీరింగ్ అభ్యసిస్తున్న వారికి ఏడాదికి ₹2,00,000 వరకు అందజేస్తారు.
ఐఐఎమ్ విద్యార్థులు : ఐఐఎమ్‌లలో ఎంబీఏ లేదా పీజీడీఎమ్ చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి ₹5,00,000 వరకు అందజేస్తారు.
విదేశీ విద్య : విదేశీ విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యనభ్యసించే SC/ST వర్గానికి చెందిన విద్యార్థులకు ప్రతి సంవత్సరం ₹20,00,000 వరకు అందజేస్తారు.

అర్హత 
అభ్యర్థి తప్పనిసరిగా భారతీయ పౌరుడై ఉండాలి
అకడమిక్ మార్కులు : కనీసం 75% మార్కులు లేదా 7.0 CGPA సాధించి ఉండాలి.
(Note: SC / ST వర్గానికి చెందిన విద్యార్థులు 67.5% మార్కులు లేదా 6.30 CGPA సాధిస్తే సరిపోతుంది).
కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి :
స్కూల్ (9వ – 12వ తరగతి) విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం ₹3,00,000 లోపు ఉండాలి.
డిగ్రీ, పీజీ, మెడికల్, ఐఐటీ, ఐఐఎమ్ అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం ₹6,00,000 లోపు ఉండాలి.

50% సీట్లు మహిళా విద్యార్థినులకు మరియు 50% సీట్లు SC/ST విద్యార్థులకు కేటాయించబడ్డాయి.




కావలసిన పత్రాలు
మునుపటి విద్యాసంవత్సరం మార్కుల జాబితా
ప్రభుత్వ గుర్తింపు పొందిన ఐడీ కార్డ్
ప్రస్తుత విద్యాసంవత్సరం ఫీజు రశీదు
కుటుంబ వార్షిక ఆదాయ ధృవీకరణ పత్రం
విద్యార్థి లేదా తల్లిదండ్రుల SBI బ్యాంక్ ఖాతా పాస్‌బుక్ కాపీ
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో

SBI Platinum Jubilee Asha Scholarship 2026 దరఖాస్తు చేసుకునే విధానం

అధికారిక వెబ్‌సైట్ sbiashascholarship.co.in లేదా Buddy4Study ప్లాట్‌ఫామ్‌ను ఓపెన్ చేయండి.
ఇమెయిల్ ఐడీ లేదా ఫోన్ నంబర్‌తో కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ అవ్వండి.
ప్రస్తుతం మీరు చదువుతున్న కోర్సుకు సంబంధించిన (School, Degree, Medical, IIT, etc.) స్కాలర్‌షిప్ లింక్‌పై క్లిక్ చేయండి.
అప్లికేషన్ ఫారమ్‌లో మీ వ్యక్తిగత వివరాలు, విద్యా సంబంధిత మార్కులు మరియు బ్యాంక్ ఖాతా వివరాలను జాగ్రత్తగా నమోదు చేయండి.




పైన పేర్కొన్న కావలసిన పత్రాలన్నీ స్పష్టమైన స్కాన్ కాపీలుగా అప్‌లోడ్ చేయండి.
నమోదు చేసిన వివరాలన్నీ సరి చూసుకొని అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేయండి.

Apply Online For SBI Platinum Jubilee Asha Scholarship 2026

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *