Press ESC to close

Telangana Municipal Department: తెలంగాణ మున్సిపల్ శాఖలో 886 ఉద్యోగాలు

Telangana Municipal Department Notification 2026-27 – 886 Posts

Telangana Municipal Department Notification 2026-27: తెలంగాణ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలో మొత్తం 886 కొత్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అవ్వనుంది . కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సిబ్బంది కొరతను తీర్చేందుకు ఈ పోస్టులను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కొత్త మున్సిపాలిటీలకు అవసరమైన ఉద్యోగుల వివరాలను అధికారులు ఇప్పటికే సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి కార్యాలయం, ఆర్థిక శాఖ నుంచి అంగీకారం లభించినట్లు తెలుస్తోంది. ఇక మంత్రివర్గం తుది ఆమోదం ఇవ్వాల్సి ఉంది.




కొత్త మున్సిపాలిటీల్లో భర్తీ చేయనున్న వివిధ విభాగాలకు చెందిన పోస్టులు..

మున్సిపల్ కమిషనర్
డిప్యూటీ కమిషనర్
జూనియర్ అసిస్టెంట్
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE)
హెల్త్ అసిస్టెంట్
అకౌంటెంట్
ఇతర సిబ్బంది పోస్టులు

ఖాళీలు

మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-3) 20
డిప్యూటీ కమిషనర్ (స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలు) 11
జూనియర్ అసిస్టెంట్ 86
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 56
హెల్త్ అసిస్టెంట్ 40
సీనియర్ అకౌంటెంట్ 40
జూనియర్ అకౌంటెంట్ 40
ఇతర సాంకేతిక, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందితదితర పోస్టులు ఉన్నాయి.




మంత్రివర్గం ఆమోదం తర్వాత నియామక ప్రక్రియ ముందుకు వెళ్లనుంది. ఈ పోస్టులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరిలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

పోస్టుల వారీగా విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు నోటిఫికేషన్ వచ్చిన తరువాత వెలువడనున్నాయి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *