Press ESC to close

అమరావతికి కేంద్రం భారీగా నిధులు!

Amaravati Railway Line: అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. 57 కి. మీ పొడవున కొత్త రైల్వే వంతెన నిర్మాణం జరగడానికి ఆమోదం తెలిపింది. మొత్తం రూ.2245 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) ప్రకటించారు. కృష్ణ నదిపై (Krishna River) 3.2 కి.మీ పొడవు మేర మూడు బ్రిడ్జ్‌ల నిర్మాణం జరగనుంది. 

హైదరాబాద్ (Hyderabad), చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, నాగపూర్‌తో పాటు దేశంలో ఉండే ప్రధాన మెట్రో నగరాలను కలిపి రైల్వే కనెక్టవిటీని నిర్మించనున్నారు. ఎర్రుపాలెం (Errupalem) నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు కొత్త రైల్వే లైన్‌ నిర్మాణం చేపట్టనున్నారు. 

ఈ కొత్త రైల్వే లైన్‌ను అమరావతి స్థూపం, ఉండవల్లి గుహలు, అమరలింగేశ్వరస్వామి ఆలయం, ధ్యానబుద్ధ ప్రాజెక్ట్‌కి వెళ్లే వారికి అనుగుణంగా అభివృద్ధి చేయనున్నారు. అలాగే కృష్ణ పట్నం, మచిలీపట్నం, కాకినాడ పోర్టులను కూడా కలుపుతూ రైల్వే లైన్‌ను ఏర్పాటు చేయనున్నారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *