Press ESC to close

Andhra Pradesh Budget 2026-27 | Highlights | Key Points

AP Budget 2026-27 | Highlights | Key Points

ఏపీ బడ్జెట్‌కు (AP Budget 2026) రంగం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి నెలలో రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 11 నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు జరుగనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. సమావేశాల తొలి రోజున రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ (Abdul Nazeer) ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తరువాతి రోజు అంటే 12న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ జరుగుతుంది. ఫిబ్రవరి 14న రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) సభలో ప్రవేశపెట్టనున్నారు. అదే రోజున వ్యవసాయ శాఖకు సంబంధించిన బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) సమర్పించనున్నారు.

2024 జూన్ 12న రాష్ట్రంలో టీడీపీ (TDP) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత 2025లో తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గత బడ్జెట్‌లో మొత్తం వ్యయం మూడు లక్షల 22 వేల కోట్ల రూపాయలకు పైగా ఉండటం విశేషం. తొలిసారిగా రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల కోట్ల మైలురాయిని దాటింది. రాష్ట్ర ఆదాయం పెరుగుతుందన్న అంచనాలు, వివిధ రంగాల నుంచి వచ్చే ఆదాయంపై నమ్మకంతో ఆ బడ్జెట్‌ను రూపొందించారు.

Budget Estimates 2026-27 – Comprehensive instructions for the preparation of Budget
Estimates & Revised Estimates and online submission –Issued.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *