Unstoppable Season 4: నందమూరి బాలకృష్ణ (Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అద్భుతమైన టాక్ షో అన్‌స్టాపబుల్ నాలుగో సీజన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలి మూడు సీజన్లలో ఘనవిజయం సాధించిన ఈ షో నాలుగో సీజన్ కు సిద్ధమైంది. సీజన్ 4 ఇటీవల దసరా రోజున విడుదలైంది.
తొలి ఎపిసోడ్‌లో ఏపీ సీఎం నారాచంద్రబాబు నాయుడు వచ్చారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్‌ని అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ మేరకు చంద్రబాబుకు బాలయ్య పుష్పగుచ్ఛం అందజేసి అన్‌స్టాపబుల్ సెట్‌కి ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన పలు ఫొటోలు వైరల్‌గా మారాయి.

Leave a Reply