Press ESC to close

AP Forest Department Jobs 2025 : ఏపీ అటవీ శాఖ లో 689 ఉద్యోగాలకు నోటిఫికేష‌న్‌.. ఎప్పుడంటే…?

AP Forest Department Recruitment 2025 

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో 689 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చిరంజీవి చౌదరి గారు తెలిపారు.

ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసి ఆరు నెలల్లో అటవీ శాఖలో ఖాళీలను భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ , ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మరియు ఇతర ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు.

కొన్ని నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా అటవీ శాఖలో ఖాళీలను భర్తీ చేసేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే.

భ‌ర్తీ చేయ‌నున్న పోస్టులు : 689
–> ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌- 175
–> ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌- 37
–> ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌- 70
–> అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌- 375
–> జూనియర్‌ అసిస్టెంట్‌- 10
–> థానేదార్‌- 10
–> టెక్నికల్‌ అసిస్టెంట్‌- 12

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *