Press ESC to close

ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

AP TET Result 2025-26 Released | Check Score Card Here at https://tet2dsc.apcfss.in/

ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2025) ఫలితాలు విడుదలయ్యాయి. గతేడాది డిసెంబర్‌ 10 నుంచి 21 వరకు జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షకు 2,71,692 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,48,427 మంది హాజరైనట్లు ఏపీ టెట్ కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించి ముందుగా ప్రాథమిక కీ విడుదల చేశారు. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత తుదిఫలితాలు వెల్లడించినట్లు కన్వీనర్‌ పేర్కొన్నారు.


టెట్‌లో 97,560 మంది (39.27 శాతం) ఉత్తీర్ణులు అయ్యారు. ఈ పరీక్షకు 31,886 మంది ఇన్‌ సర్వీసు ఉపాధ్యాయులు హాజరుకాగా.. వారిలో 47.82 శాతం(15,239) మంది ఉపాధ్యాయులు ఉత్తీర్ణులయ్యారు. టెట్‌ పరీక్ష ఫలితాలను https://tet2dsc.apcfss.in, http://cse.ap.gov.in, 9552300009 వాట్సప్‌ నెంబర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చని టెట్‌ కన్వీనర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

Click Here For AP TET Results

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *