
DSC 2024 Special History Important Bits in Telugu
1. ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ సంవత్సరంలో బెంగాల్ దివాన్ అయ్యింది?
1) 1765 ఆగష్టు 12
2) 1764 ఆగష్టు 12
3) 1757,ఆగష్టు 12
4) 1775 ఆగష్టు 12
2. మొగల్ చక్రవర్తి రెండో షా అలం నుంచి రాబర్ట్ క్లైవ్ ఏ ప్రాంతాల దివానీ అధికారాలు పొందాడు?
1) బెంగాల్
2) బిహార్
3) ఒడిశా
4) పైవన్నీ
3. 1770లో బెంగాల్లో వచ్చిన భయంకరమైన కరవు వల్ల బెంగాల్ జనాభాలో ఎన్నో వంతు జనాభా చనిపోయారు?
1) 1/2 వ
2) 1/3 వ
3) 1/4 వ
4) 1/10 వ
4. 1765కు ముందు ఇంగ్లండ్ నుంచి ఏ లోహాలు దిగుమతి చేసుకుని భారతీయ వస్తువులను కంపెనీ కొనేది?
1) బంగారం
2) వెండి
3) 1,2
4) రాగి
5. బెంగాల్ లో కరవు కాటకాలు (1770) రావడానికి ప్రధాన కారణం?
1) ధాన్యం దిగుబడి తగ్గడం.
2) బెంగాల్ భూములు సారవంతమైనవి కావు.
3) బ్రిటిషర్లు అనుసరించిన విధానాలు.
4) ప్రజలు సాగుకు దూరంగా ఉండటం.
6. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
1) 1790
2) 1793
3) 1798
4) 1770
7. బెంగాల్ లో ఉపకౌలు రైతుల దీనస్థితిని తెలియజేసిన వ్యక్తి ఎవరు?
1) నిగెల్ వార్డెన్
2) అలెగ్జాండర్ రీడ్
3) కారన్ వాలీస్
4) హెచ్.టి.కోల్ బ్రూక్
8. కింది వాటిలో శాశ్వత నిర్ణయ పద్ధతికి సంబంధించి సరైంది?
1) ఈ విధానాన్ని కారన్ వాలీస్ ప్రవేశపెట్టాడు.
2) ఈ విధానంలో శిస్తును స్థిరంగా నిర్ణయిస్తారు.
3) ఈ విధానం కంపెనీకి ఎక్కువ ఆదాయాన్ని అందించలేదు.
4) పైవన్నీ
9. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిలో భాగంగా శిస్తు వసూలు అధికారం ఎవరికి ఉంటుంది?
1) రాజులు
2) తాలుక్దార్లు
3) జమీందార్లు.
4) పైవారందరూ
10. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి కంపెనీకి ఎక్కువ లాభదాయకం కానప్పటికీ ఈ విధానాన్ని అనుసరించడానికి కారణం?
1) ఈ విధానం క్రమబద్ధమైన రాబడిని ఇస్తుంది కాబట్టి.
2) జమీందార్లు భూమి అభివృద్ధికి పెట్టుబడులు పెడతారని కంపెనీ భావించింది.
3) కంపెనీ ఎలాగైనా ఒక పన్ను విధానాన్ని తీసుకురావాలనుకోవడం,
4) ఈ విధానం వల్ల వారి అధికారం మెరుగుపడుతుందని భావించడం.
11. శాశ్వత శిస్తు నిర్ణయ పద్దతి వల్ల ఎక్కువ లాభపడింది ఎవరు?
1) జమీందార్లు
2) ఈస్ట్ ఇండియా కంపెనీ
3) వడ్డీ వ్యాపారాలు
4)1,3


Source/eenadu

Leave a Reply