
AP WCD Anganwadi Notification 2025 Apply Now
AP Anganwadi Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ (AP WCD) అనంతపురం జిల్లాలో ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి అధికారికంగా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. 01 జులై 2025 నాటికి వయసు 21 Yrs నుండి 35 Yrs లోపల ఉండవలెను. ఖాళీల వివరాల కొరకు సంబంధిత సిడిపివో కార్యాలయంలో సంప్రదించవలెను. ఖాళీల విషయంలో మార్పులు, చేర్పులు ఉండవచ్చును.
మొత్తం ఖాళీలు: 92
పోస్ట్ వారీగా ఖాళీలు
అంగన్వాడీ హెల్పర్ – 14
అంగన్వాడీ వర్కర్ – 78
అర్హత
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి (10th Pass) ఉత్తీర్ణత తప్పనిసరి.
వయోపరిమితి
2025 జూలై 1 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
వేతనం
పోస్టును అనుసరించి నెలకు రూ.7,000 నుంచి రూ.11,500 వరకు జీతం.
ఎంపిక విధానం
స్థానికత (Local Preference)
తెలుగు డిక్టేషన్ పరీక్ష
దరఖాస్తు విధానం: దరఖాస్తులు ఆఫ్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు.
ముఖ్య తేదీలు
దరఖాస్తు ప్రారంభ తేదీ: 24 డిసెంబర్ 2025
దరఖాస్తు చివరి తేదీ: 31 డిసెంబర్ 2025
ఎలా దరఖాస్తు చేయాలి :
అర్హత కలిగిన అభ్యర్థులు తమ అప్లికేషన్ తో పాటు కులము (SC/ST/BC అయితే), నివాసము, పుట్టిన తేది, 10వ తరగతి మార్క్స్ మెమో, ఆధార్, వికలాంగత్వముకు సంబందించిన పత్రములను జిరాక్స్ తీసుకొని గెజిటెడ్ అధికారిచే ధృవీకరణ పత్రాలను జతపరచవలయును. నకలు సిడిపిఒలందరూ తప్పనిసరిగా తహశీల్దారు, ఎం.పి.డి.ఓ, పి.హెచ్.సి, మునిసిపల్ కార్యాలయాలలోని నోటీసు బోర్డులందు ఉంచే విధముగా తగు చర్యలు తీసుకొనవలయును.
AP WCD Anganwadi Recruitment Notification PDF
AP WCD Anganwadi Application Form
Also Read: RRB గ్రూప్ D రిక్రూట్‌మెంట్ 2026 – 22000 పోస్టులు | ITI, 10th అర్హతతో

Leave a Reply