Press ESC to close

APSRTC JOBS: ఆర్టీసీలో 7673 ఉద్యోగాలు

APSRTC Recruitment 2026: APSRTC సంస్థలో ఖాళీగా ఉన్న రెగ్యులర్ డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఖాళీగా ఉన్న 7673 రెగ్యులర్ పోస్టుల నియామకానికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

ఈ మేరకు ఆర్టీసీ పాలకమండలి సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపింది.

వీటిలో 3673 డ్రైవర్ పోస్టులు, 1813 కండక్టర్ పోస్టులు సహా డిపోల్లో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న మెకానిక్ లు, శ్రామిక్ లు, తదితర పోస్టుల భర్తీకి అనుమతించాలని ప్రభుత్వాన్ని బోర్డు కోరింది.

ఆన్ కాల్ డ్రైవర్ల రోజువారీ వేతనాన్ని రూ.800 నుంచి 1000 రూపాయలకు పెంచాలని నిర్ణయించారు. డబుల్ డ్యూటీ చేసే కండకర్లకు ఇచ్చే మొత్తాన్ని రూ.900కు పెంచింది.

మరోవైపు ఏపీలో స్త్రీ శక్తి పథకం అమలుతో ఆర్టీసీ బస్సులలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. పురుషులతో పోలిస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేసేందుకు అదనంగా బస్సులు సమకూర్చుకోవటంపైనా ఏపీఎస్ఆర్టీసీ దృష్టి సారించింది. అలాగే డ్రైవర్, కండక్టర్ పోస్టుల భర్తీపైనా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే 7673 రెగ్యులర్ పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది.

Also Read: ఇండియా పోస్ట్ GDS రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్ 28740 ఖాళీలు

Comments (2)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *