APSRTC – Chandrababu Naidu: ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగుల్లో ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ప్రమాద బీమా (Accident insurance) చేయనున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. దీనికోసం ఒక్కొక్కరికి రూ.499 చొప్పున ప్రీమియం చెల్లించాలని అవికూడా ఆయా కాంట్రాక్టర్లు చెల్లిస్తారని తెలిపింది. ASSY కింద బీమా అమలు చేయనున్నామని యాజమాన్యం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ బీమా ఉద్యోగుల్లో ఎవరెవరికి వర్తిస్తుందో కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఏపీఎస్ ఆర్టీసీలోని ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు ప్రభుత్వం ఈ బీమా సౌకర్యాన్ని కల్పించ నుంది. వారందరికి రూ.10 లక్షల ప్రమాద బీమా వర్తింపజేస్తూ ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. తాజా నిర్ణయంతో అద్దె బస్సుల డ్రైవర్లు, ఔట్ సోర్సింగ్ డ్రైవర్లు, ట్రాఫిక్ గైడ్లు, కౌంటర్లలో బస్ టికెట్లు బుక్‌చేసే సిబ్బంది, ఏసీ బస్సుల్లోని అటెండర్లు, బస్టాండ్లు, గ్యారేజ్‌లు, ఆర్టీసీ కార్యాలయాల్లో పనిచేసే స్వీపర్లు, ఇతర ఉద్యోగులు అందరికీ బీమా వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఏఎస్‌ఎస్‌వై (Antyodaya Shramik Suraksha Yojana) కింద ఈ బీమా అమలు చేయనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వుల్లో పేర్కొన్నది.

Leave a Reply