
సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేవి రంగవల్లులు, భోగి మంటలు, గొబ్బెమ్మలు. ప్రతీ ఇంటి ముందు అందమైన రంగు రంగుల ముగ్గులు కనువిందు చేస్తుంటాయి. పెద్ద పెద్ద ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు పెట్టడం పూర్వ కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం.
ఇంటి ముందు రంగవల్లులు ఎందుకు వేస్తారు
రంగోలి అనేది సాంప్రదాయ భారతీయ కళారూపం. కొన్ని నమ్మకాల ప్రకారం రంగులు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి.. దుష్ప్రభావాలను దూరం చేస్తాయని భావిస్తారు. సంక్రాంతికి రంగాలు వేయడం వెనుక శాస్త్రీయ కారణాల కంటే సంస్కృతి, సాంప్రదాయ విశ్వాసాలు ఎక్కువగా ఉన్నాయి.
గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు
ఆవు పేడతో తయారు చేసిన గొబ్బెమ్మలను ముగ్గు మధ్యలో పెట్టి వాటిలో నవ ధాన్యాలు వేసి.. పూలతో అలంకరిస్తారు.
శాస్త్రీయ కారణం
ఆవు పేడలో యాంటీ బియోటిక్ లక్షణాలు ఉంటాయి. ఇంటి ముందు ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెడితే ఇంట్లోకి సూక్ష్మ క్రిములు రాకుండా కాపాడుతుంది.

ఆధ్యాత్మిక ఆధారాలు
కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోపికా స్త్రీల రూపాలకు సంకేతమే గొబ్బెమ్మలు. ముగ్గు మధ్యలో ఉండే పెద్ద గొబ్బెమ్మను గోదాదేవికి సంకేతంగా భావిస్తారు. హిందూ సాంప్రదాయంలో ఆవును గౌరీ మాతగా పూజిస్తారు. కొత్త ఏడాది సిరి సంపదలు, సుఖ సంతోషాలు కలగాలని పవిత్రమైన ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను ఇంటి ముందు పెట్టి పూజిస్తారు.

Leave a Reply