Press ESC to close

Maha Shivratri 2025: మహాశివరాత్రి రోజు భార్యకు ఈ బహుమతి ఇస్తే.. మీరు ఊహించనివి జరుగుతాయ్!

Maha Shivratri 2025: ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో కృష్ణ పక్ష చతుర్దశి రోజు మహా శివరాత్రి పండుగను అత్యంత అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది మహాశివరాత్రి ఫిబ్రవరి 26న (బుధవారం) వస్తుంది
చాలా మంది భక్తులు ఈ రోజున పూజలు చేయడం, ఉపవాసాలు ఉండటం వంటివి చేస్తారు. దీని కారణంగా శివుని నుండి ప్రత్యేక అనుగ్రహం కలుగుతుందని హిందువులు నమ్ముతారు.

శివుడు, పార్వతి వివాహ వార్షికోత్సవంగా మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు. అందువల్ల ఆ రోజున భర్త తన భార్యకు ఓ బహుమతి ఇవ్వడం వల్ల ఆమెను సంతోషపెట్టగలడని నమ్ముతారు. అంతేకాకుండా ఆమెకు అదృష్టాన్ని సైతం తీసుకురాగలడని హిందువుల నమ్మకం.

Also Read: Maha Shivaratri 2025: మహా శివరాత్రి నుంచి దశ తిరగబోతున్న రాశుల ఇవేఈ బహుమతి ఇవ్వాలి
ప్రతి ఒక్క భర్త మహాశివరాత్రి నాడు తన భార్యకు వెండి పట్టీలను బహుమతిగా ఇస్తే చాలా మంచిదని అంటున్నారు.

ఎందుకంటే దీని వల్ల శుక్రుని అనుగ్రహం లభిస్తుందట. శుక్రుని బలం లేదా ఆనందం వల్ల ఒక వ్యక్తికి సంబంధించిన అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. అంతేకాకుండా జీవితంలో అన్ని రకాల విలాసాలు, సుఖాలు లభిస్తాయని కొందరు చెబుతున్నారు.

Maha-Shivratri-2025-silver-anklet.webp
Credits: jiomart

వెండి పట్టీలు ధరించడం వల్ల కూడా ఎన్నో మంచి ప్రయోజనాలు పొందొచ్చు. వెండి పట్టీల వల్ల చంద్రగ్రహం బలపడుతుంది. దీంతో ఇల్లు, ఫ్యామిలీ నుంచి ప్రతికూల శక్తులు తొలగిపోయి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు. శారీరకంగానూ, మానసికంగానూ సానుకూలత పెరుగుతుంది. అది మాత్రమే కాకుండా వైవాహిక జీవితంలో శాంతి, ప్రేమ ఎక్కువగా పెరుగుతుంది.

Also Read: Maha Shivratri 2025: మహాశివరాత్రి.. ఆ టైంలో శివ పూజ చేస్తే మీకు ఇక తిరుగుండదు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *