Press ESC to close

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. గూగుల్ సంస్థ భారీ పెట్టుబడులు

ఏపీలో (విశాఖ) తాజాగా పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో పటిష్టమైన సాంకేతిక పర్యావరణ వ్యవస్థను నెలకొల్పడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా, ఆంధ్రప్రదేశ్‌లో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ (Google) గ్లోబల్ కంపెనీ ఎంఓయూ కుదుర్చుకుంది.

Google,AP Government, CM Chandrababu Naidu, Nara Lokesh
ఎంఓయూపై సంతకాలు చేసిన అధికారులు
ఈ మేరకు అమరావతిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), రాష్ట్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ (Nara Lokesh) సమక్షంలో గూగుల్‌, ఏపీ ప్రభుత్వ అధికారులు ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా భారత ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.


ఎమ్ఒయు సందర్భంగా అమరావతికి వెళ్లిన గూగుల్ ప్రతినిధి బృందానికి గూగుల్ గ్లోబల్ నెట్‌వర్క్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (జిజిఎన్‌ఐ) వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలే (Bikash Koley) నేతృత్వం వహించగా, రాష్ట్ర ప్రభుత్వం తరపున చీఫ్ సెక్రటరీ నిరభ్ కుమార్, పరిశ్రమలు మరియు పెట్టుబడుల కార్యదర్శి యువరాజ్ మరియు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

Google,AP Government, CM Chandrababu Naidu, Nara Lokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *